Telugu Web Series OTT: ఒకే రోజు ఓటీటీల్లోకి వస్తున్న రెండు తెలుగు వెబ్ సిరీస్‍లు.. డిఫరెంట్ జానర్లతో..

Best Web Hosting Provider In India 2024


Telugu Web Series OTT: ఇటీవలి కాలంలో తెలుగు వెబ్ సిరీస్‍ల జోరు కాస్త తగ్గింది. గత రెండు నెలలుగా తెలుగులో రూపొందిన సిరీస్‍లు పెద్దగా రాలేదు. అయితే, ఈ వారంలో మాత్రం ఏకంగా రెండు తెలుగు వెబ్ సిరీస్‍లు అడుగుపెట్టనున్నాయి. ఒకే రోజు స్ట్రీమింగ్‍కు రానున్నాయి. పరువు వెబ్ సిరీస్ థ్రిల్లర్ జానర్లో రూపొందగా.. యక్షిణి సిరీస్ సోషియో ఫ్యాంటసీ రొమాంటిక్ డ్రామాగా వస్తోంది. ఒకదానితో పోలిస్తే మరొకటి డిఫరెంట్ జానర్లతో వస్తున్నాయి. పరువు, యక్షిణి సిరీస్‍ల వివరాలు ఇవే.

పరువు సిరీస్

పరువు వెబ్ సిరీస్ జూన్ 14వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సిరీస్‍లో నరేశ్ అగస్త్య, నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. పరువు హత్యల నేపథ్యంలో ఈ సిరీస్ రూపొందింది. పవన్ సాదినేని నేతృత్వంలో ఈ సిరీస్‍కు సిద్ధార్థ్ నాయుడు, రాజశేఖర్ వడ్లపాటి దర్శకత్వం వహించారు. నాగబాబు, రమేశ్, సునీల్ కొమ్మిశెట్టి, ప్రణీత్ పట్నాయక్ ఈ పరువు వెబ్ సిరీస్‍లో కీలకపాత్రలు పోషించారు.

ఇటీవలే వచ్చిన పరువు వెబ్ సిరీస్ ట్రైలర్ ఇంటెన్స్‌గా ఉంటూ అంచనాలను పెంచింది. సుధీర్ (నరేశ్ అగస్త్య), డాలీ (నివేద పేతురాజ్) కులాంతర ప్రేమ వివాహం చేసుకోగా.. వారిని పెద్దలు వెంటాడుతారు. హత్య చేసేందుకు ప్రయత్నిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది.. వాళ్లు తప్పించుకున్నారా.. అనే అంశాల చుట్టూ పరువు సిరీస్ రూపొందింది. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‍మెంట్స్ నిర్మిస్తున్న ఈ సిరీస్‍కు శర్వణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. జూన్ 14 నుంచి తెలుగుతో పాటు తమిళంలోనూ పరువు సిరీస్‍ను జీ5 ఓటీటీలో చూడొచ్చు.

యక్షిణి

యక్షిణి వెబ్ సిరీస్ జూన్ 14వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ స్ట్రీమింగ్‍కు రానుంది. కోట బొమ్మాళి పీఎస్ ఫేమ్ రాహుల్ విజయ్, వేదిక, మంచు లక్ష్మి, అజయ్ ఈ సిరీస్‍లో ప్రధాన పాత్రలు పోషించారు. సోషియో ఫ్యాంటసీ రొమాంటిక్ డ్రామాగా ఈ సిరీస్ రూపొందింది. బాహుబలి ప్రొడక్షన్ హౌస్ ఆర్కా మీడియా వర్క్స్ పతాకం కింద శోభూ యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‍ను నిర్మించారు.

యక్షిణి వెబ్ సిరీస్‍కు తేజ మర్ని దర్శకత్వం వహించారు. రామ్ వంశీకృష్ణ కథను అందించారు. అల్కాపురి అనే వేరే లోకం నుంచి భూమిపైకి వచ్చిన మాయా (వేదిక) చుట్టూ ఈ సిరీస్ స్టోరీ తిరుగుతుంది. ఫ్యాంటసీ ఎలిమెంట్లతో పాటు లవ్ స్టోరీతో కూడా ప్రధానంగా ఉంటుంది. యక్షిణి ట్రైలర్ క్యూరియాసిటీని పెంచింది. శ్రీనివాస్, తేజ కాకుమాను, దయానంద్ రెడ్డి, తెనాలీ శకుంతల, లలిత కుమారి, జెమినీ సురేశ్, త్రినాథ్, ప్రణీత, హరువీర్ ఈ సిరీస్‍లో కీరోల్స్ చేశారు. ఈ సిరీస్‍కు ప్రశాంత్ సుబ్రమణియం సంగీతం అందించగా.. కార్తికేయ రోహిణి ఎడిటింగ్ చేశారు. జగదీశ్ చీకటి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. జూన్ 14న యక్షిణి సిరీస్ తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బంగ్లా, మరాఠీ భాషల్లోనూ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తుంది.

టీ20 వరల్డ్ కప్ 2024

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024