NTR Bharosa Pensions: ఏపీలో పెన్షన్ల పేరు మార్పు, ఇకపై ఎన్టీఆర్ భరోసా పెన్షన్లుగా పంపిణీ

Best Web Hosting Provider In India 2024


NTR Bharosa Pensions: ఏపీ సామాజిక పెన్షన్లను ఎన్టీఆర్ భరోసా పెన్షన్లుగా పేరు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పెన్షన్లను రూ.3వేల నుంచి రూ.4వేలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

టీడీపీ ప్రభుత్వం అందించే సామాజిక పింఛన్ల పేరును ఎన్టీఆర్ భరోసాగా పునరుద్దరిస్తూ ఉత్తర్వులు సిఎస్‌ ఉత్వర్లు జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ పెన్షన్ కానుకగా ఈ పథకాన్ని అమలు చేశారు. పెన్షన్‌గా అందించే రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

జులై 1నుంచి వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పింఛన్ రూ.4 వేలకు పెంచారు. ట్రాన్స్ జెండర్లు, గీత కార్మికులు, మత్స్యకార వర్గాలకు పింఛన్ రూ.4 వేలకు పెంచారు. దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచారు. పూర్తిస్థాయి దివ్యాంగులకు పింఛన్ రూ.5 వేల నుంచి రూ.15 వేలకు పెంచారు.

తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారికి రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పింఛన్ పెంచారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్‌ నెల నుంచి కొత్త పెన్షన్లను అమలు చేయనున్నారు. జులై నెల పెన్షన్లతో పాటు ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు సంబంధించిన బకాయిలను కూడా చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

18న క్యాబినెట్ సమావేశం…

ఈ నెల 18న ఏపీ కేబినెట్ తొలి సమావేశాన్ని నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతున్న తొలి భేటీ ఇదే. ఈ నెల 19నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించే అవకాశం ఉంది. స్పీకర్ ఎన్నిక, ఎమ్మెల్యేల ప్రమాణం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, బడ్జెట్ ఆమోదం కోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు.

Open PDF in New Window

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్

Andhra Pradesh NewsTdpYsrcp Vs TdpChandrababu NaiduTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News

Source / Credits

Best Web Hosting Provider In India 2024