Kalki Pre Release Business: కల్కి 2898 ఏడీ సినిమాకు భారీగా థియేట్రికల్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్‍కు టార్గెట్ ఎంతంటే!

Best Web Hosting Provider In India 2024


Kalki 2898 AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ చిత్రంపైనే సినీ జనాల కళ్లన్నీ ఉన్నాయి. ఈ మూవీ రిలీజ్ డేట్ సమీపిస్తున్న కొద్దీ హైప్ విపరీతంగా పెరిగిపోతోంది. జూన్ 27వ తేదీన కల్కి మూవీ తెలుగు, హిందీతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్‍తో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ మైథాలజీ మూవీకి అదే రేంజ్‍లో బంపర్ ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగింది. కల్కి 2898 ఏడీ చిత్రం థియేట్రికల్ హక్కులు భారీ ధరలకు అమ్ముడయ్యాయి.

థియేట్రికల్ బిజినెస్ ఇలా..

కల్కి 2898 ఏడీ సినిమాకు మొత్తంగా రూ.394 కోట్ల థియేట్రికల్ రైట్స్ బిజినెస్ జరిగినట్టు లెక్కలు బయటికి వచ్చాయి. ఇంత కళ్లు చెదిరే మొత్తానికి హక్కులు అమ్ముడయ్యాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

కల్కి 2898 ఏడీ సినిమా ఆంధ్రా థియేట్రికల్ హక్కులకు రూ.85 కోట్లు దక్కాయి. సీడెడ్‍లో రూ.27 కోట్లకు ఈ రైట్స్ అమ్ముడయ్యాయి. నైజాం థియేట్రికల్ హక్కులను మూవీ టీమ్ రూ.70కోట్లకు విక్రయించింది. దీంతో మొత్తంగా ఆంధప్రదేశ్, తెలంగాణ రాష్టాల్లో కల్కి మూవీకి ఏకంగా రూ.182 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని లెక్కలు వెల్లడయ్యాయి.

ఇతర భాషలు, ఉత్తరాదిలో ఇలా..

కల్కి 2898 ఏడీ సినిమా ఉత్తర భారత థియేట్రికల్ హక్కులు రూ.80 కోట్లకు అమ్ముడయ్యాయి. ఏఏ ఫిల్మ్స్ ఉత్తరాదిలో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. కర్ణాటకలో ఈ సినిమాకు రూ.30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. తమిళనాడు, కేరళ థియేట్రికల్ హక్కులు రూ.22 కోట్లకు అమ్ముడయ్యాయి.

కల్కి సినిమా విదేశీ ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులకు ఏకంగా రూ.80కోట్ల భారీ ధర దక్కింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.394 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్ హక్కులు అమ్ముడయ్యాయి.

బ్రేక్ ఈవెన్‍కు ఎంత?

థియేట్రికల్ బిజినెస్ లెక్కల ప్రకారం.. కల్కి 2898 ఏడీ సినిమాకు బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.395 కోట్ల షేర్ అంటే సుమారు రూ.800కోట్ల గ్రాస్ కలెక్షన్లు రావాలి. అంతకు మించి వసూళ్లు వస్తే హిట్ స్టేటస్ దక్కించుకుంది.

క్రేజ్‍ను బట్టి చూస్తే కల్కి 2898 ఏడీ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1000కోట్ల మార్క్ సులువుగా దాటేస్తుందనే అంచనాలు ఉన్నాయి. పాజిటివ్‍గా వస్తే చాలా రికార్డులు బద్దలయ్యే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన రెండు ట్రైలర్లు విజువల్ వండర్‌గా ఉంటూ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. గ్లోబల్ రేంజ్‍లో ఈ మూవీకి హైప్ ఉంది.

కల్కి 2898 ఏడీ సినిమాను సుమారు రూ.600కోట్ల బడ్జెట్‍తో వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మించారనే అంచనాలు ఉన్నాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ అద్భుతమైన విజన్‍తో భారతీయ పురాణాల ఆధారంగా ఈ సైన్స్ ఫిక్షన్ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణ్, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, శోభన ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

టీ20 వరల్డ్ కప్ 2024

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024