Best Web Hosting Provider In India 2024

Minister Nara Lokesh On Jagan : వైసీపీ పార్టీ ఆఫీసుల నిర్మాణం చర్చనీయాంశంగా మారింది. తాడేపల్లిలో నిర్మిస్తున్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని శనివారం సీఆర్డీఏ అధికారులు కూల్చేవేశారు. ఇదే కాకుండా విశాఖలో నిర్మిస్తున్న ఆఫీసుకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. దీంతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
ప్రభుత్వం చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటన కూడా విడుదల చేశారు. ప్రభుత్వ బెదిరింపులు తలొగ్గేది లేదన్నారు. ఇదిలా ఉంటే… జగన్ ను టార్గెట్ చేస్తూ మంత్రి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు.
ధనదాహానికి అంతులేదా…? మంత్రి లోకేశ్
జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత జాగీరా అని లోకేశ్ ప్రశ్నించారు. “ వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా వెయ్యి రూపాయల నామ మాత్రపు లీజుకి 33 ఏళ్లకు కేటాయించుకున్నావు. జనం నుంచి దోచుకున్న 500 కోట్లతో ప్యాలెస్‌లు కడుతున్నావ్. నీ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన 600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చు. నీ విలాసాల ప్యాలెస్‌ల నిర్మాణానికి అయ్యే 500 కోట్లతో 25వేల మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వవచ్చు.ఏంటి ఈ ప్యాలెస్‌ల పిచ్చి? నీ ధనదాహానికి అంతులేదా?” అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఈ పోస్టుకు కొన్ని ఫొటోలను జత చేశారు.
టీ20 వరల్డ్ కప్ 2024
టాపిక్