మీకోసమే బ్లాక్ బుక్ రెడీ చేశా, అధికారుల పేర్లు రిజిస్టర్ చేస్తున్నాం – BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వార్నింగ్

Best Web Hosting Provider In India 2024


BRS MLA Padi Koushik Reddy : హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రొటోకాల్ ప్రకారం అధికారులు నడుచుకోవటం లేదని… ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన…. కొందరి మంత్రుల ఆదేశాల మేరకు అధికారులు నడుచుకుంటూ… స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న తనకు చెప్పకుండానే కార్యక్రమాలు చేసే పనిలో ఉన్నారని విమర్శించారు.

అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించవద్దని పాడి కౌశిక్ రెడ్డి కోరారు. ఎవరైతే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారో వారి పేర్లను బ్లాక్ బుక్ లో నమోదు చేస్తున్నానని చెప్పారు. అలాంటి వారికోసమే బ్లాక్ బుక్ సిద్ధం చేశానని హెచ్చరించారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని…మళ్లీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి అధికారులకు బ్లాక్ డేస్ ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.

“రూల్స్ ప్రకారం ముందుకెళ్లండి. అందుకు వ్యతిరేకంగా వ్యవహరించే అధికారులు జాగ్రత్తగా ఉండాలి. ఇష్టారాజ్యాంగా వ్యవహరించే అధికారులను హెచ్చరిస్తున్నాను. మీలాంటి వాళ్ల కోసమే బ్లాక్ బుక్ ను సిద్ధం చేశా. ఇందులో పేర్లు రిజిస్టర్ చేస్తున్నాను. అధికారం ఎవరికి శాశ్వతం కాదు.మా పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు బ్లాక్ డేస్ ఉంటాయి” అని కౌశిక్ రెడ్డి కామెంట్స్ చేశారు.

ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపై కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే అవ్వ, తాతలకు పింఛన్లు రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచుతామని చెప్పాడని గుర్తు చేశారు.  కానీ పింఛన్లపై ఆధారపడిన అవ్వ, తాతలకు మూడు నెలల నుంచి పింఛన్లను ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్

BrsKarimnagarKarimnagar Lok Sabha Constituency

Source / Credits

Best Web Hosting Provider In India 2024