Baak OTT: ఓటీటీలో ట్రెండింగ్‍లో టాప్‍కు వచ్చేసిన తమన్నా, రాశీ ఖన్నా హారర్ సినిమా.. ఆ సీన్‍పై ట్రోల్స్

Best Web Hosting Provider In India 2024


Baak OTT: తమిళ సీనియర్ యాక్టర్ సుందర్ సి, హీరోయిన్లు తమన్నా భాటియా, రాశీ ఖన్నా మెయిన్ రోల్స్ చేసిన అరణ్మనై 4 చిత్రం థియేటర్లలో మంచి హిట్ అయింది. సుందర్ దర్శకత్వంలోనే హారర్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం మే 3వ తేదీన థియేటర్లలో విడుదలైంది. తెలుగు డబ్బింగ్‍లో ఈ సినిమా ‘బాక్’ పేరుతో అడుగుపెట్టింది. తమిళంలో ఈ మూవీకి భారీ వసూళ్లు వచ్చినా.. తెలుగులో పెద్దగా ఆడలేదు. కాగా, ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. అయితే, ఓటీటీలో తెలుగు వెర్షన్ బాక్ దుమ్మురేపుతోంది.

ట్రెండింగ్‍లో టాప్

అరణ్మనై 4 చిత్రం తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో జూన్ 21వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే, తెలుగు వెర్షన్ ‘బాక్’ రెండు రోజుల్లోనే హాట‍్‍స్టార్ ఓటీటీ ఇండియా ట్రెండింగ్‍లో టాప్‍కు వచ్చేసింది. ఒరిజినల్ తమిళ వెర్షన్‍ను మించి తెలుగు వెర్షన్ దూసుకుపోతోంది.

తమన్నా సీన్‍పై ట్రోలింగ్

బాక్ చిత్రంలోని ఓ సీన్‍పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో తమన్నాను ఓ వ్యక్తి కొడుతుంటే ఆమె పిల్లలకు తెలియకూడదని ప్రయత్నిస్తుంటారు. తనపై దాడి జరుగుతున్నా పిల్లల వైపు నవ్వుతూ చూస్తుంటారు. ఈ చిత్రంలో ఇది ఎమోషనల్ సీన్ అయినా.. సోషల్ మీడియాలో మాత్రం దీనిపై ట్రోల్స్ వస్తున్నాయి. మెలోడ్రామా, ఔట్‍డేటెడ్ ఐడియా అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఓవరాల్ మూవీకి పాజిటివ్ అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి.

కలెక్షన్లు ఇలా..

అరణ్మనై 4 (బాక్) చిత్రం సుమారు రూ.30 కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. ఈ చిత్రం మే 3న థియేటర్లలో రిలీజ్ కాగా మిశ్రమ స్పందన వచ్చింది. కానీ, తమిళంలో ఈ చిత్రానికి క్రమంగా వసూళ్లు పెరిగాయి. రూ.100 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బస్టర్ అయింది. తెలుగు వెర్షన్ బాక్‍కు మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. అయితే, తెలుగు వెర్షన్‍కు ఓటీటీలో మంచి వ్యూస్ దక్కుతున్నాయి. అవ్నీ సినీమ్యాక్స్, బెంజ్ మీడియా బ్యానర్లపై ఖుష్బూ సుందర్, అరుణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

అరణ్మనై 4 చిత్రంలో సుందర్, తమన్నా, రాశీ ఖన్నాతో పాటు రామచంద్ర రాజు, సంతోష్ ప్రతాప్, యోగిబాబు, కోవై సరళ, వీటీవీ గణేశ్, జయప్రకాశ్ ఈ మూవీలో కీలకపాత్రల్లో నటించారు. సిమ్రన్, ఖుష్బూ క్యామియో రోల్స్ చేశారు. ఈ చిత్రానికి హిప్‍హాప్ తమిళ సంగీతం అందించగా.. ఈ కృష్ణస్వామి, కిచ్చా సినిమాటోగ్రఫీ చేశారు.

హాట్‍స్టార్‌లో హిందీలో ఆవేశం

మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘ఆవేశం’ హిందీలో వచ్చేస్తోంది. హాట్‍స్టార్ ఓటీటీలో ఈ మూవీ హిందీ వెర్షన్ జూన్ 28వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఇప్పటికే మలయాళంలో ఆవేశం చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుండగా.. హిందీలో మాత్రం హాట్‍స్టార్ ఓటీటీలో అడుగుపెడుతోంది. మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ ఈ యాక్షన్ కామెడీ మూవీలో హీరోగా నటించారు. జీతూ మాధవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో ఏప్రిల్ 11న రిలీజై బ్లాక్‍బస్టర్ అయింది. రూ.150కోట్లకు పైగా కలెక్షన్లు కైవసం చేసుకుంది.

టీ20 వరల్డ్ కప్ 2024

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024