Best Web Hosting Provider In India 2024
NNS 24th June Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం సోమవారం (జూన్ 24) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అమర్, మిస్సమ్మ ఇంటికి రావడంతో దిష్టితీసి ఇంట్లోకి రమ్మంటుంది నీల. అమ్మా.. మిస్సమ్మ మరో రెండు రోజులపాటు సపోర్ట్ లేకుండా నడవకూడదని దగ్గరుండి చూసుకోమని అంటాడు అమర్. నేనే మీ నాన్న పక్కన లేకుండా అడుగు వేయలేను ఇంక నేనెలా మిస్సమ్మను చూసుకోగలను అంటుంది నిర్మల. ఇక్కడుంటే ఈ మిస్సమ్మను చూసుకోమని నాకు చెప్తారని అక్కడ నుంచి వెళ్లిపోతుంది మనోహరి.
మిస్సమ్మని ఎత్తుకొని తీసుకెళ్లిన అమర్
మిస్సమ్మను నేను దగ్గరుండి చూసుకుంటానంటున్న నీలను కోప్పడి లోపలకు పంపిస్తుంది నిర్మల. పర్లేదండి.. నేను మేనేజ్ చేసుకుంటాను అంటుంది మిస్సమ్మ. అలా ఎలా మేనేజ్ చేస్తావు అంటాడు అమర్. అలాంటప్పుడు నువ్వే ఎందుకు మిస్సమ్మకు సేవ చేయకూడదు మీ అమ్మకు బాలేకపోతే నేను చూసుకోవట్లేదా అంటాడు శివరామ్.
ఏం జరుగుతుందో అర్థంకాక అయోమయపడుతుంది అరుంధతి. అంతసేపు నిల్చోకూడదు మీరు లోపలకు వెళ్లండి నేను మీకు తినడానికి ఏమైనా చేస్తాను అంటూ వెళ్లిపోతుంది నిర్మల. మీకు ఇబ్బందిగా ఉంటే పర్లేదండి అంటున్న మిస్సమ్మను వారించి ఎత్తుకుని రూమ్‌లోకి తీసుకెళ్తాడు అమర్. తలుపు సందులో నుంచి చూసిన నిర్మల, శివరామ్ సంబరపడిపోతారు. మనోహరి కుళ్లుకుంటుంది.
రూమ్‌లోకి తొంగి చూసిన గుప్త
అరుంధతి బాధపడటం చూసి ఓదారుస్తాడు చిత్రగుప్తుడు. మరికొన్ని రోజుల్లో నా భర్త నన్ను పూర్తిగా మర్చిపోతాడని అంటున్న అరుంధతితో అతను నిన్ను తనలో పూర్తిగా నింపుకున్నాడు, అతనిలో నువ్వు సగం, అతను నీతోపాటుగానే భవిష్యత్తులోకి అడుగుపెడతాడు అని నచ్చజెప్పుతాడు గుప్త. రూమ్‌లో ఏం జరుగుతుందో చూద్దామంటున్న గుప్తతో వద్దని అంటుంది అరుంధతి.
అయినప్పటికీ గుప్త వినకుండా అమర్ రూమ్ కిటికీ దగ్గరకు వెళ్లి చూస్తాడు. మిస్సమ్మను ఎత్తుకుని వచ్చిన అమర్ జారి తనపై పడిపోతాడు. ఇద్దరూ దగ్గరగా ఉండటంతో ఒకరినొకరు దగ్గరగా చూసుకుంటారు. మిస్సమ్మ తాళి అమర్ షర్ట్ బటన్‌లో ఇరుక్కుంటుంది. ఇదంతా చూడకుండానే చెప్పేస్తుంది అరుంధతి. అంత కచ్చితంగా ఎలా చెప్తున్నావని ఆశ్చర్యపోతాడు అమర్. అనుభవం గుప్తగారు అంటుంది అరుంధతి. మిస్సమ్మని బెడ్‌పై పడుకోబెట్టి ఏదైనా అవసరమైతే పిలవమని చెప్పి వెళ్తాడు అమర్. థ్యాంక్స్ చెబుతుంది మిస్సమ్మ.
భాగీ కోసం అమర్ వంట
నీలని పిలిచి డబ్బులిచ్చి నాలుగు రోజులు ఇంటికి వెళ్లమని పంపిస్తాడు శివరామ్. ఏం చేస్తున్నారండీ.. నీల లేకుంటే ఇంటిపని, వంటపని ఎవరు చేస్తారు. మిస్సమ్మ కూడా బాగాలేదు అంటుంది నిర్మల. ఏం జరుగుతుందో చూడు అంటాడు శివరామ్. ఇంతలో పిల్లలు కిందకి వచ్చి డిన్నర్‌కి ఇంకా పిలవలేదేంటి? అని అడుగుతారు. ఇంకా ఎవరూ డిన్నర్ ప్రిపేర్ చేయలేదని తెలుసుకుని ఆకలేస్తుంది అంటారు. ౌ
అంతలో అమర్ కూడా కిందకి వస్తాడు. డిన్నర్ ఎవరు చేస్తారు? అనుకుంటుండగా మనోహరి తనపై ఎక్కడ పడుతుందోనని తనకి ఉపవాసం అంటుంది. అయినా ఎప్పుడైనా వంట చేస్తే కదా.. ఎవరో ఒకరు చేస్తే తినడమే కదా అంటాడు శివరామ్. కోపంతో లోపలకు వెళ్తుంది మనోహరి. ఫుడ్ ఆర్డర్ పెడతానంటున్న అమర్‌ని అడ్డుకుంటుంది నిర్మల.
బయట ఫుడ్ వద్దని అనడంతో తనే వండుతానని కిచెన్లోకి వెళ్తాడు అమర్. మిస్సమ్మ కోసం అమర్ వంట చేసేలా చేయడయే తన ప్లాన్ అంటాడు శివరామ్. వెంటనే రాథోడ్‌ని తీసుకుని మిస్సమ్మ గదికి వెళ్లి అమర్ వంట చేస్తున్నాడని చెప్తాడు. ఆశ్చర్యపోయిన మిస్సమ్మతో వంట చేయడమే కాదు.. కాసేపట్లో నీకు తెచ్చి తినిపిస్తాడు చూడు అంటూ వెళ్లిపోతారు. అమర్ వంట పిల్లలకి నచ్చుతుందా? భాగీకి అమర్ దగ్గర కానున్నాడా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు జూన్ 24న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టీ20 వరల్డ్ కప్ 2024
Best Web Hosting Provider In India 2024
Source / Credits