AP Cabinet Meeting: చంద్రబాబు అధ్యక్షతన ఏపీలో ఎన్డీఏ తొలి క్యాబినెట్‌ భేటీ ప్రారంభం

Best Web Hosting Provider In India 2024


AP Cabinet Meeting: ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తొలి క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి సమావేశం ఇదే.

క్యాబినెట్ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై క్యాబినెట్‌లో చర్చించనున్నారు. ఏపీలో దాదాపు 14లక్షల కోట్ల రుపాయల అప్పులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో వాస్తవ ఆర్థిక పరిస్థితిపై క్యాబినెట్‌లో చర్చించనున్నారు.

గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై కూడా క్యాబినెట్‌ భేటీలో చర్చించనున్నారు. 8అంశాలపై శ్వేత పత్రాలను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పయ్యావుల కేశవ్, అనిత, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్ తదితరులతో క్యాబినెట్ సబ్‌ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతల ఆధారంగా శాఖల వారీగా మంత్రులు ఆర్ధిక క్రమశిక్షణ పాటించడంపై ముఖ్యమంత్రి కీలక సూచనలు చేసే అవకాశం ఉంది.

అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు అమోదం…

164కోట్ల రుపాయలతో అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు ఆర్ధిక శాఖ అమోదం తెలిపింది. క్యాబినెట్‌ భేటీలో అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై చర్చించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగా డీఎస్సీ, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, పింఛను మొత్తం రూ.4 వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై సంతకాలు చేశారు. ఈ అంశాలపై క్యాబినెట్‌ భేటీలో చర్చించి అమోదించనున్నారు.

టీడీపీ ఎన్నికల హామీల్లో సూపర్ సిక్స్ పథకాల అమలుపై క్యాబినెట్‌ భేటీలో చర్చిస్తారు. బడ్జెట్ రూపకల్పనపైనా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. సీఎంగా బాధ్యతలు చేపట్టాక పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధానిలో చంద్రబాబు పర్యటించిన సీఎం చంద్రబాబు వీటిపై కూడా క్యాబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. మంత్రివర్గ సమావేశంలో ప్రాజెక్టుల పరిస్థితి, పూర్తి చేసేందుకు నిధుల సమీకరణపైనా చర్చించే అవకాశం ఉంది.

జులై నెలాఖరులోగా అసెంబ్లీ లో పూర్తిస్థాయి బడ్జెట్ పై చర్చించే అవకాశాలు ఉన్నాయి. కొత్త బడ్జెట్ తయారీలో ప్రాధాన్య అంశాలపైనా దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఎసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లపై కూడా క్యాబినెట్‌లో చర్చించనున్నారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు మెగా డీఎస్సీ, ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు, పింఛను మొత్తం రూ.4 వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై చంద్రబాబు ఐదు సంతకాలు చేశారు. మంత్రివర్గ సమావేశంలో వీటికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సూపర్‌ 6 పథకాల అమలు, అందుకు అనుగుణంగా బడ్జెట్‌ రూపకల్పనపై మంత్రివర్గంలో చర్చించనున్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్

Chandrababu NaiduTdpGovernment Of Andhra PradeshAndhra Pradesh NewsTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News

Source / Credits

Best Web Hosting Provider In India 2024