Kalki 2898 AD advance bookings: కల్కి 2898 ఏడీ అడ్వాన్స్ బుకింగ్స్‌.. అన్ని రికార్డులు బ్రేక్.. క్రాష్ అయిన బుక్ మై షో

Best Web Hosting Provider In India 2024


Kalki 2898 AD advance bookings: కల్కి 2898 ఏడీ మూవీకి ఉన్న హైప్ ఏ స్థాయిలో ఉందో మనకు తెలుసు. ఈ సినిమా కోసం ఎన్నో రోజులుగా వేచి చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన వెంటనే రికార్డు స్థాయిలో టికెట్లు కొంటున్నారు. బుక్‌మైషో వెబ్ సైట్, యాప్ క్రాష్ అయిపోయాయంటే ఈ మూవీ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కల్కి 2898 ఏడీ అడ్వాన్స్ బుకింగ్స్

ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ గురువారం (జూన్ 27) రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం నార్త్ అమెరికాలో చాలా రోజుల కిందటే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇండియాలో ఆదివారం (జూన్ 23) నుంచి ప్రారంభమయ్యాయి. కాసేపట్లోనే ఈ బుకింగ్స్ లో అన్ని రికార్డులు బ్రేకయ్యాయి.

డంకీ, సలార్ లాంటి సినిమాల రికార్డులు తిరగరాస్తోందీ మూవీ. తొలి రోజే టికెట్ల అమ్మకాల ద్వారా ఇండియాలో రూ.6 కోట్లు వసూలు చేయడం విశేషం. అటు నార్త్ అమెరికాలో ఇప్పటికే 3 మిలియన్ డాలర్లు దాటేసింది. దీంతో మొత్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే రూ.20 కోట్లకుపైగా వచ్చేశాయి. దేశవ్యాప్తంగా తొలి రోజు అన్ని షోలు దాదాపు ఫుల్ అయ్యాయి.

బుక్ మై షో క్రాష్

కల్కి 2898 ఏడీ మూవీ టికెట్ల కోసం దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎగబడటంతో బుక్ మై షో వెబ్ సైట్, యాప్ క్రాష్ అయ్యాయి. గంట వ్యవధిలోనే ఏకంగా 68 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ఈ స్థాయిలో టికెట్లు అమ్ముడవడం ఇదే తొలిసారి. దీంతో బుక్ మై షో నిర్వాహకులకు టికెట్ల అమ్మకం ఓ సవాలుగా మారింది.

టాప్ 10 మూవీస్ ఇవే

జవాన్ : 86 వేల టికెట్లు

లియో: 83 వేలు

యానిమల్: 80 వేలు

కల్కి 2898 ఏడీ: 68 వేలు (అడ్వాన్స్ బుకింగ్స్)

టైగర్ 3: 66 వేలు

గదర్ 2: 63 వేలు

సలార్: 55 వేలు

నిజానికి కల్కి 2898 ఏడీ అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. దేశంలోని కొన్ని ప్రధాన మార్కెట్లలో టికెట్ల అమ్మకాలు చేయడం లేదు. అయినా కూడా షారుక్ ఖాన్ జవాన్ మూవీకి దగ్గరగా రావడం విశేషం. ఈ సినిమా ట్రైలర్లు, ప్రమోషన్లతో మూవీపై హైప్ మరింత పెరిగింది. ఈ లెక్కన చూస్తే ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు అన్ని ఇండియన్ సినిమాల రికార్డును బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.700 కోట్ల వరకు వసూలు చేస్తే లాభాల్లోకి వెళ్తుంది. మూవీకి ఉన్న క్రేజ్ చూస్తుంటే అదేమంత పెద్ద విషయంలా కనిపించడం లేదు. తొలి రోజు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా.. తొలి వారంలోనే రికార్డు వసూళ్లు ఖాయం. ఇక ప్రీరిలీజ్ బిజినెస్ రూపంలోనే ఈ సినిమా థియేట్రికల్, శాటిలైట్, ఓటీటీ, ఆడియో హక్కుల రూపంలో ఏకంగా రూ.950 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

టీ20 వరల్డ్ కప్ 2024

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024