Malayalam Comedy Movie: ఓటీటీలోకి వస్తున్న మరో సూపర్ హిట్ మలయాళ కామెడీ మూవీ.. తెలుగులోనూ చూడొచ్చు

Best Web Hosting Provider In India 2024


Malayalam Comedy Movie: ఈ ఏడాది వచ్చిన మరో సూపర్ హిట్ మలయాళ కామెడీ మూవీ గురువాయూరంబాల నడయిల్. ఈ సినిమాలో సలార్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్లో నటించాడు. బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఈ విషయాన్ని ఈ మూవీ ఓటీటీ పార్ట్‌నర్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వెల్లడించింది.

ఓటీటీలోకి మలయాళం కామెడీ మూవీ

ఈ ఏడాది మలయాళం సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అవన్నీ కమర్షియల్ గానూ బాగా సక్సెస్ అయ్యాయి. అలాంటి మూవీయే పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన గురువాయూరంబాల నడయిల్. విపిన్ దాస్ డైరెక్ట్ చేసిన ఈ కామెడీ ఎంటర్టైనర్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. గురువారం (జూన్ 27) నుంచే ఈ సినిమా ఓటీటీలోకి రానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది.

పృథ్వీరాజ్ సుకుమారన్ తోపాటు బేసిల్ జోసెఫ్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.90 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. నిజానికి ఈ మూవీ డిజిటల్ హక్కులు ప్రైమ్ వీడియోకి దక్కినట్లు మొదట్లో వార్తలు వచ్చినా.. చివరికి భారీ మొత్తానికి హాట్‌స్టార్ దక్కించుకుంది. ఇప్పుడు ఓటీటీలో మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మలయాళం ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది.

ఏంటీ గురువాయూరంబాల నడయిల్ మూవీ?

పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఈ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథ ఓ పెళ్లి చుట్టూ తిరుగుతుంది. వినూ రామచంద్రన్ (బేసిల్ జోసెఫ్) అనే వ్యక్తి విదేశాల్లో పని చేస్తున్నా.. తనను కాదని మరో పెళ్లి చేసుకున్న గర్ల్‌ఫ్రెండ్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. అలాంటి వ్యక్తి పెద్దలు కుదిర్చిన సంబంధానికి సరే అంటూ అంజలి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుంటాడు.

ఈ క్రమంలో అంజలి సోదరుడు ఆనందన్ (పృథ్వీరాజ్ సుకుమారన్)తో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. అయితే ఆనందన్ ఓ షార్ట్ టెంపర్ ఉన్న వ్యక్తి. పెళ్లి కోసం వినూ రామచంద్రన్ విదేశాల నుంచి సొంతూరికి వచ్చిన తర్వాత అసలు కామెడీ కథ మొదలువుతుంది. ఈ కామెడీ మూవీని మలయాళ ప్రేక్షకులు బాగా ఆదరించారు.

సలార్ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సినిమా కావడంతో ఓటీటీలో ఈ సినిమా తెలుగు వెర్షన్ కు కూడా మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమా.. ఓటీటీలో ఎంత మేర సక్సెస్ అవుతుందో చూడాలి.

హాట్‌స్టార్ మలయాళం మూవీస్

ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఎన్నో సూపర్ హిట్ మలయాళ సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది వచ్చిన మంజుమ్మెల్ బాయ్స్ తోపాటు ప్రేమలు, అబ్రహం ఓజ్లర్ తోపాటు కన్నూరు స్క్వాడ్, నేరు, కింగ్ ఆఫ్ కొత్తలాంటి సినిమాలు కూడా చూడొచ్చు.

టీ20 వరల్డ్ కప్ 2024

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024