Best Web Hosting Provider In India 2024

AP NTR Pensions: ఏపీలో సామాజిక పెన్షన్లు అందుకుంటున్న వారికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. జూలైలో కొత్త పెన్షన్లను పాత బాకీలతో కలిపి అందించాలనే నిర్ణయానికి క్యాబినెట్ అమోద ముద్ర వేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి రూ.7,000 పెన్షన్ అందించనున్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా సామాజిక పెన్షన్లను రూ.4వేలకు పెంచుతామని చంద్రబాబు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఫైల్‌పై తొలి సంతకం చేశారు.
జూలై 1వ తేదీ నుంచి పింఛన్ల పెంపుపై మంత్రివర్గంలో చర్చించారు. ఇప్పటికే పెన్షన్ల పెంపుదలపై విస్తృతంగా చర్చించిన ముఖ్యమంత్రి క్యాబినెట్‌లో అమోద ముద్ర వేశారు. సామాజిక పెన్షన్ల కింద ఇచ్చే మొత్తం రూ.3వేల నుంచి రూ.4లకు పెంచాలని నిర్ణయానికి తొలి క్యాబినెట్‌లో ఆమోదం తెలిపారు.
జులై 1 నుంచి పెంచిన పింఛన్లను ఇంటి వద్దే అందజేయాలని నిర్ణయించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత మూడునెలలకు కలిపి వచ్చే నెలలో ఒక్కొక్కరికి రూ.7వేల పింఛను అందనుంది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది లబ్ధిదారులకు ఈ మొత్తాలను పంపిణీ చేయనున్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బకాయిలతో కలిపి లబ్దిదారులకు పెన్షన్లను అందించనున్నారు.
టీ20 వరల్డ్ కప్ 2024
టాపిక్