Amitabh Bachchan: ప్రభాస్ అభిమానులను క్షమాపణ కోరిన అమితాబ్ బచ్చన్.. ఎందుకంటే..

Best Web Hosting Provider In India 2024


Amitabh Bachchan – Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ సినిమా విడుదల దగ్గరపడుతోంది. ఈవారంలోనే జూన్ 27వ తేదీన ఈ మైథాలజీ సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ మూవీ థియేటర్లలోకి రానుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ తరుణంలో కల్కి మూవీలో ప్రధాన పాత్రలు పోషించిన రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్‍తో పాటు నిర్మాతలు ప్రియాంక దత్, స్వప్నదత్ ముచ్చటించుకున్నారు. సినిమా విశేషాలను మాట్లాడారు. ఈ వీడియోను వైజయంతీ మూవీస్ వెల్లడించింది.

ప్రభాస్ అభిమానులు క్షమించాలి

కల్కి 2898 ఏడీ సినిమాలో తాను ప్రభాస్‍ను కొట్టే సీన్లు ఉన్నాయని అమితాబ్ బచ్చన్ చెప్పారు. అందుకే ప్రభాస్ అభిమానులందరూ తనను క్షమించాలని, తనపై దాడి చేయవద్దని బిగ్‍బీ సరదాగా అన్నారు. అయితే అందరూ మీ ఫ్యాన్సే అని అమితాబ్‍తో ప్రభాస్ అన్నారు.

కల్కి 2898 ఏడీ సినిమాలో తాను భారీ కాయంతో కనిపిస్తానని అమితాబ్ అన్నారు. “నాగీ (దర్శకుడు నాగ్‍అశ్విన్) నా దగ్గరికి వచ్చి ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. ఈ మూవీలో నేను, ప్రభాస్ ఎలా కనిపిస్తామో కొన్ని ఫొటోలు చూపించారు. ది ప్రభాస్‍ను కొట్టే భారీ వ్యక్తిని నేను. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ నన్ను క్షమించండి. నేను చేతులు జోడించి క్షమాపణ కోరుతున్నా. సినిమాలో నేను ఏం చేశానో చూసి నాపై దాడి చేయవద్దు” అని అమితాబ్ బచ్చన్ అన్నారు.

అమితాబ్ మాటలకు ప్రభాస్ రియాక్ట్ అయ్యారు. వాళ్లందరూ మీ అభిమానులే అని బిగ్‍బీతో ప్రభాస్ చెప్పారు. అమితాబ్ మాటలకు అందరూ సరదాగా నవ్వారు. ఈ చిత్రంలో అశ్వత్థామ పాత్ర పోషించారు అమితాబ్. దక్షిణాది సినీ ఇండస్ట్రీల్లో క్రమశిక్షణ ఎక్కువ ఉంటుందని అమితాబ్ బచ్చన్ అన్నారు. కల్కి 2898 ఏడీ సినిమా సెట్స్ ఎంతో ప్రశాంతంగా, అద్భుతంగా ఉండేదని అన్నారు. కమల్ హాసన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ది నా బెస్ట్ క్యారెక్టర్

కల్కి 2898 ఏడీ సినిమాలో చేసిన క్యారెక్టర్ తన కెరీర్లోనే బెస్ట్ క్యారెక్టర్ అని ప్రభాస్ చెప్పారు. సూపర్ హీరో, గ్రే షేడ్స్, ఫన్నీ ఇలా అన్ని కలిసి తన పాత్ర ఉంటుందని చెప్పారు. కల్కి చిత్రంలో ప్రభాస్ క్యారెక్టర్ విషయంలో భారీ ట్విస్ట్ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.

కల్కి 2898 ఏడీ సినిమా టికెట్ల బుకింగ్స్ ఇప్పటికే చాలా చోట్ల ఓపెన్ అయ్యాయి. భారీ స్థాయిలో బుకింగ్స్ జరుగుతోంది. ట్రెండ్‍ను బట్టి చూస్తే తొలి రోజు రికార్డుస్థాయిలో కలెక్షన్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది. హైదరాబాద్‍లోని చాలా థియేటర్లలో బుకింగ్స్ మొదలైన కాసేపటికే హౌస్ ఫుల్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్‍లోని మరికొన్ని గంటల్లో టికెట్ల బుకింగ్ మొదలుకానుంది.

కల్కి 2898 ఏడీ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. రెండు ట్రైలర్లతో ఈ సినిమాపై హైప్ పెరిగిపోయింది. అయితే, మూవీ టీమ్ పెద్దగా ప్రమోషన్లను నిర్వహించలేదు. ఇప్పటి వరకు ముంబైలో మాత్రమే ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిపింది. కల్కి 2898 ఏడీ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ భారీ బడ్జెట్‍తో నిర్మించింది. జూన్ 27న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతోంది. 2డీ, 3డీ, ఐమాక్స్ ఫార్మాట్లలో వస్తోంది.

టీ20 వరల్డ్ కప్ 2024

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024