BGMI X Kalki 2899 AD: బీజీఎంఐ గేమ్‍లో కల్కి 2898 ఏడీ.. ట్రైలర్ రిలీజ్

Best Web Hosting Provider In India 2024


BGMI X Kalki 2899 AD: కల్కి 2898 ఏడీ ప్రమోషన్‍కు మూవీ టీమ్ మరో వెరైటీ ప్లాన్‍ అమలు చేస్తోంది. ఎంతో పాపులర్ అయిన బ్యాటిల్ రొయాల్ గేమ్ క్రాఫ్టన్ బ్యాటిల్‍గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ)తో కలిపింది. కల్కి 2898 ఏడీ సినిమా జూన్ 27వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీకి విపరీతమైన క్రేజ్ ఉంది. దీన్ని మరింత పెంచేలా బీజీఎంను గేమింగ్ పార్ట్‌నర్‌గా మూవీ టీమ్ ఎంపిక చేసింది. దీనికి సంబంధించిన బీజీఎంఐ x కల్కి 2898 ఏడీ ట్రైలర్ నేడు (జూన్ 24) వచ్చింది.

బీజీఎంఐలో కల్కి క్యారెక్టర్లు

బీజీఎంలో కల్కి 2898 ఏడీ ట్రైలర్‌ను మూవీ టీమ్ తీసుకొచ్చింది. “రికార్డులు చెక్ చేసుకో.. నేను ఇప్పటి వరకు ఒక్క రికార్డు కూడా ఓడిపోలేదు” అని ప్రభాస్ చెప్పే డైలాగ్‍తో ఈ ట్రైలర్ మొదలైంది. కల్కి సినిమాలో ప్రభాస్ పోషిస్తున్న భైరవ క్యారెక్టర్ జీబీఎం గేమ్‍లో ఉండనుందని ఈ ట్రైలర్లో ఉంది. అలాగే, ఈ చిత్రంలో ఉండే చాలా పాత్రలు కూడా బీజీఎంఐలోకి వచ్చే ఇన్‍-గేమ్ ఈవెంట్‍లో ఉండనున్నాయి. కల్కి ప్రపంచం కూడా కనిపించనుంది.

బీజీఎంఐ గేమ్‍లో కల్కి 2898 ఏడీకి సంబంధించిన ఇన్-గేమ్ ఈవెంట్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. యాక్షన్, అడ్వెంచర్, స్టోరీ టెల్లింగ్‍తో బీజీఎంఐలో ఈ కల్కి గేమ్ ఈవెంట్ ఉంటుదని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ఈ గేమ్ ఆడి వారికి గేమ్ రివార్డ్స్, చాలెంజెస్ లభించనున్నాయి. బీజీఎంఐలో కల్కి స్టోరీతో ఆ ప్రపంచంలో గేమ్ ఆడే ఛాన్స్ త్వరలోనే రానుంది.

కల్కి 2898 ఏడీ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో మూడు రోజుల్లో జూన్ 27వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే చాలా చోట్ల టికెట్ల బుకింగ్స్ షురూ అయ్యాయి. భారీస్థాయిలో టికెట్లు అడ్వాన్స్ బుక్ అవుతున్నాయి.

కల్కి థీమ్ సాంగ్ వచ్చేస్తోంది

కల్కి 2898 ఏడీ సినిమా నుంచి రెండో పాట రానుంది. కల్కి థీమ్ పేరుతో వచ్చేస్తోంది. మథురలో ఈ పాట ఆవిష్కణ జరిగింది. ప్రముఖ నటి శోభనతో పాటు మరికొంత మంది నృత్వప్రదర్శన చేశారు. అయితే, ఈ పాటను నేడే (జూన్ 24) రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ వెల్లడించింది.

కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్‍తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్ లాంటి భారీ తారాగణం ఉంది. దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, శోభన, సస్వస్త ఛటర్జీ కీలకపాత్రలు పోషించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ సహా మరికొందరు స్టార్ల క్యామియో రోల్స్ ఉంటాడని కూడా రూమర్లు ఉన్నాయి.

భారతీయ పురాణాల ఆధారంగా సైన్స్ ఫిక్షన్ మూవీగా కల్కి 2898 ఏడీ చిత్రాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ భారీ బడ్జెట్‍తో ప్రొడ్యూజ్ చేశారు. తెలుగు, హిందీతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఈ మూవీ రిలీజ్ అవుతుంది.

టీ20 వరల్డ్ కప్ 2024

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024