Telugu Indian Idol S3 OTT: సింగింగ్ షో తెలుగు ఇండియన్ ఐడల్ మూడో సీజన్‍లో 12 మంది కంటెస్టెంట్లు.. వివరాలివే

Best Web Hosting Provider In India 2024


Telugu Indian Idol S3 OTT: సింగింగ్ రియాల్టీ షో ‘తెలుగు ఇండియన్ ఐడల్’ చాలా పాపులర్ అయింది. ఆహా ఓటీటీలో మొదటి రెండు సీజన్లు బాగా సక్సెస్ అయ్యాయి. ఇటీవలే మూడో సీజన్ స్ట్రీమింగ్ కూడా షురూ అయింది. అయితే, తొలి నాలుగు ఎపిసోడ్లలో ఆడిషన్లనే చూపించింది ఆహా. జూన్ 28వ తేదీ నుంచి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 అసలు పోటీ మొదలుకానుంది. ఈ సీజన్‍కు మొత్తంగా 12 మంది కంటెస్టెంట్లను ఆహా ఎంపిక చేసింది. వారి వివరాలను నేడు (జూన్ 24) వెల్లడించింది.

తెలుగు ఇండియన్ ఐడల్ మూడో సీజన్‍కు కూడా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్, సింగర్లు కార్తీక్, గీతామాధురి జడ్జిలుగా ఉన్నారు. వేల మందిని ఆడిషన్ చేసి చివరికి 12 మంది కంటెస్టెంట్లను ఎంపిక చేశారు. ఇందులో ఆరుగురు గోల్డెన్ మైక్‍తో నేరుగా అర్హత సాధించగా.. మరో ఆరుగురు గోల్డెన్ టికెట్ సాధించి తర్వాత రౌండ్ల ద్వారా క్వాలిఫై అయ్యారు.

కంటెస్టంట్లు వీరే

తెలుగు ఇండియన్ ఐడల్ మూడో సీజన్‍లో 12 మంది కంటెస్టెంట్లు తలపడనున్నారు. స్కంద వెలువలి (హైదరాబాద్‌), సాయి వల్లభ (నంద్యాల) అనిరుధ్ సుస్వరం (హైదరాబాద్‌), కీర్తన (హైదరాబాద్‌), శ్రీ కీర్తి (హైదరాబాద్‌), హరిప్రియ (హైదరాబాద్), కేశవ్ రామ్ (మెల్‍బోర్న్), రజినీ శ్రీ పూర్ణిమ (హైదరబాద్), నజీరుద్దీన్ షేక్ (మహారాష్ట్ర), కుశాల్ శర్మ, భరత్ రాజ్ (నిజామాబాద్), దువ్వూరి శ్రీ ధృతి ఈ సింగింగ్ షోలో పోటీ పడనున్నారు.

గోల్డెన్ మైక్, టికెట్ ఇలా..

ఆడిషన్ల తొలి రౌండ్‍లో స్కంద, అనిరుధ్ సుస్వరం, హరిప్రియ, శ్రీ కీర్తి, కేశవ్ రామ్,సాయి వల్లభ గోల్డెన్ మైక్ దక్కించుకున్నారు. దీంతో నేరుగా అసలు పోటీకి ఎంపికయ్యారు. కీర్తన, భరత్ రాజ్, రజనీ శ్రీ పూర్ణిమ, నజీరుద్దీన్ షేక్, కుశాల్ శర్మ, శ్రీ ధృతి ఆడిషన్ల తొలి రౌండ్‍లో గోల్డెన్ టికెట్ సాధించారు. ఆ తర్వాత మరో రౌండ్‍లో పాల్గొని బాగా పర్ఫార్మ్ చేశారు. దీంతో కంటెస్టెంట్లుగా ఎంపికయ్యారు.

వీరిలో అనురుధ్ ఇప్పటికే నేపథ్య గాయకుడిగా ఉన్నారు. చావుకబురు చల్లగా చిత్రంలో ఓ పాట పాడటంతో పాటు కొన్ని తమిళ పాటలు ఆలపించారు. కీర్తన ఇప్పటికే సూపర్ సింగర్ జూనియర్స్ షోలో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్నారు. నజీరుద్దీన్ షేక్ వివిధ పనులు చేస్తూ సంగీతం నేర్చుకున్నారు. ధృతి శ్రీ గతంలో ఎంపికైనా కుటుంబ కారణాలతో పాల్గొనలేకపోయారు. ఇప్పుడు మూడో సీజన్‍కు ఎంపికయ్యారు.

ఆహాలో స్ట్రీమింగ్ ఎప్పుడు..

తెలుగు ఇండియన్ ఐడల్ మూడో సీజన్ జూన్ 14వ తేదీన మొదలైంది. ప్రతీ శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు కొత్త ఎపిసోడ్లు ప్రసారం అవుతాయి. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్లు వచ్చినా అవి ఆడిషన్లకు సంబంధించినవే. జూన్ 28 నుంచి 12 మంది కంటెస్టెంట్లతో అసలైన పోటీ మొదలుకానుంది. ప్రతీ శుక్ర, శనివారాల్లో ఎపిసోడ్లు వస్తాయి.

ఇండియన్ ఐడల్ సీజన్ 3కి థమన్, కార్తీక్, గీతామాధురి జడ్జిలుగా ఉండగా.. శ్రీరామచంద్ర యాంకరింగ్ చేస్తున్నారు. తొలి రెండు సీజన్లు మంచి సక్సెస్ అవడంతో.. ఈ మూడో సీజన్‍పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

టీ20 వరల్డ్ కప్ 2024

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024