Sarkaar episode 11 promo: సుధీర్‌కు అనసూయ పంచ్‌లు.. చివర్లో సుడిగాలి జోరు.. సర్కార్ కొత్త ప్రోమో వచ్చేసింది

Best Web Hosting Provider In India 2024


Sarkaar episode 11 promo: సుడిగాలి సుధీర్ కు పంచ్ లు వేయించుకోవడమే కాదు వేయడమూ వచ్చు. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సర్కార్ గేమ్ షో తాజా ఎపిసోడ్ ప్రోమో చూస్తే తెలుస్తుంది. ఇప్పటికే నాలుగో సీజన్లో పది ఎపిసోడ్లు పూర్తి చేసుకోగా.. 11వ ఎపిసోడ్ వచ్చే శుక్రవారం (జూన్ 28) రానుంది. ఈ కొత్త ఎపిసోడ్ ప్రోమోను ఆహా ఓటీటీ రిలీజ్ చేసింది.

సర్కార్ కొత్త ఎపిసోడ్ ప్రోమో

ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సర్కార్ గేమ్ షోకి రానురాను క్రేజ్ పెరిగిపోతోంది. సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్న ఈ షో నవ్వులు పూయిస్తూనే వచ్చిన సెలబ్రిటీ గెస్టులను ఆటాడిస్తోంది. తాజాగా 11వ ఎపిసోడ్ కు ఈ షో రెడీ అయింది. ఈ కొత్త ఎపిసోడ్ కోసం యాంకర్ అనసూయ, సింగర్లు మనో, గీతామాధురి, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ వచ్చారు.

ఈ నలుగురితో ఎప్పటిలాగే సుధీర్ మంచి వినోదాన్ని పంచబోతున్నట్లు ప్రోమో చూస్తే స్పష్టమవుతోంది. ఇందులో మొదటగా యాంకర్ అనసూయ ఎంట్రీ ఇచ్చింది. ఏంటండీ.. ఇంత అందంగా రెడీ అయి వచ్చారు అని సుధీర్ అనగా.. యాంకర్ నువ్వని తెలియక అంటూ అనసూయ పంచ్ వేసింది. సూయ సూయ అనసూయ అనే పాటతో ఆమె ఓ పొట్టి డ్రెస్ వేసుకొని షోకి వచ్చింది.

ఆ తర్వాత కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ వచ్చాడు. అతడు కూడా తనదైన స్టైల్లో సుధీర్ ఓ పంచ్ వేశాడు. కొరియోగ్రాఫర్లందరూ నంబర్లు లెక్కపెడుతూ 8 దగ్గరే ఎందుకు ఆపేస్తారు అని సుధీర్ అడిగితే.. మనిషి అన్నాక ఎక్కడో ఓ చోట ఆపాలి.. నీలా కాదు అంటూ భాస్కర్ అనడం విశేషం. ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చిన సింగర్ మనో కూడా నీ ఒళ్లంతా కసేరా అంటూ సుధీర్ ను ఓ ఆటాడుకున్నాడు.

చివర్లో సుధీర్ పంచ్

ఇక నాలుగు నిమిషాలకుపైన ఉన్న ఈ ప్రోమో చివర్లో సుధీర్ కూడా నలుగురు కంటెస్టెంట్లకు ఓ పంచ్ వేశాడు. పవన్ కల్యాణ్ గురించి ప్రశ్న అడుగుతున్నాని చెబుతూ.. సీటు కాదు కదా.. అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అనే డైలాగు కొడతాడు. అంతటితో ప్రోమో ముగుస్తుంది. ఈ కొత్త ఎపిసోడ్ ప్రోమోను ఆహా ఓటీటీ తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేసింది.

“అసలేంటి సార్ ఈ ఫైరు.. ప్రోమో ఎండ్ లో ఇచ్చారు అసలైన ఫియరు” అనే క్యాప్షన్ తో ఆహా ఓటీటీ ఈ కొత్త ప్రోమోను ప్రేక్షకులతో పంచుకుంది. ఇప్పటి వరకూ వచ్చిన పది ఎపిసోడ్లలాగే ఈ కొత్త ఎపిసోడ్ కూడా చాలా ఎంటర్టైనింగా ఉండబోతోందని తాజా ప్రోమో చూస్తే స్పష్టమవుతోంది. అనసూయ ఈ షోకి స్పెషల్ అట్రాక్షన్ లాగా కనిపిస్తోంది.

సర్కార్ గేమ్ షో ప్రస్తుతం ఆహా ఓటీటీలో టాప్ ట్రెండింగ్స్ లో తొలి స్థానంలో ఉంది. ఈ షో నాలుగో సీజన్ ప్రారంభమైనప్పటి నుంచీ సర్కార్ టాప్ లోనే కొనసాగుతుండటం విశేషం.

టీ20 వరల్డ్ కప్ 2024

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024