Kalki Tickets Prices: ప్రభాస్ కల్కి 2898ఏడి సినిమా టిక్కెట్ ధరల పెంపుకు ఏపీ సర్కారు ఉత్తర్వులు

Best Web Hosting Provider In India 2024


Kalki Tickets Prices: ప్రభాస్‌ నటించిన కల్కి మూవీ టిక్కెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్‌ 27న విడుదల కానున్న కల్కి చిత్రం టిక్కెట్ల ధరలు పెంచడానికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో కూడా టిక్కెట్ ధరల్ని పెంచుకోడానికి హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్‌ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.

సినిమా విడుదల సందర్భంగా రోజుకు ఐదు షోలు వేసుకునేందుకూ కల్కి మూవీకి ఏపీలో వెసులుబాటు కల్పించారు. టిక్కెట్ ధరల్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 75కు, మల్టీ స్క్రీన్స్ థియేటర్లలో రూ.125కు పెంచడానికి వీలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

సినిమా విడుదలైన తేదీ నుంచి రెండు వారాల పాటు కల్కి మూవీ టిక్కెట్ ధరలను పెంచుకోడానికి ఆంధ్రప్రదేశ్‌లో వెసులుబాటు కల్పించారు. ఈ నెల 27వ తేదీన కల్కి విడుదల కానుంది. చిత్ర నిర్మాత నిర్మాత అశ్వనీదత్ వినతి మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్

Andhra Pradesh NewsKalki 2898 AdGovernment Of Andhra PradeshTelugu MoviesTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News

Source / Credits

Best Web Hosting Provider In India 2024