Best Web Hosting Provider In India 2024

అనంతపురం: అప్పర్ భద్ర ప్రాజెక్టుపై న్యాయ పోరాటం చేస్తామని రాప్తాడు వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు హాయాంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల ఆ చేదుగుళికలు ఇప్పటికీ మనం అనుభవించాల్సి వస్తోంది. కర్నాటకలో దేవేగౌడ ప్రధాని మంత్రిగా ఉన్నప్పుడు ఏఐబీపీ నిధులను కర్నాటకకు తరలించారు. అప్పుడే చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల అల్ మట్టి ఎత్తు పెంచారు. పొరుగు రాష్ట్రాలకు మన హక్కులను తాకట్టు పెట్టినందుకు… కర్ణాటక కాటన్ దొరగా చంద్రబాబును అభివర్ణించాలి. తన మనసులో మాట పుస్తకంలో కూడా వ్యవసాయంపై పెట్టుబడి దండుగ అన్న మాట చంద్రబాబు మనసులో నుంచి వచ్చిందని అందరికీ తెలుసు. అప్పట్లో ఎగువన ఉన్న కర్ణాటక ఇరిగేషన్ పై ఉదాహరణకు 100 రూపాయలు ఖర్చు పెడితే.. చంద్రబాబు 50 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. చంద్రబాబు హయాంలో కర్నాటకలో అనేక అక్రమ ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టారు..అప్పుడు చంద్రబాబు నోరెత్తలేదు. కర్నాటక చేపడుతున్న అప్పర్ భద్ర ప్రాజెక్టు వల్ల దిగువ రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతోంది. దీనిపై మేం అనేక సార్లు, అనేక వేదికలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా కేంద్రం ఆమోదం తెలిపింది. అందుకే కృష్ణా జలాల్లో ఏపీ వాటా విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. చంద్రబాబు హయాంలో అప్పర్ భద్రకు అన్ని అనుమతులు వస్తున్నా మాట్లాడలేదు
– పట్టిసీమ లిఫ్ట్ పెట్టి, గోదావరి జలాల డైవర్షన్ వల్ల కృష్ణా జలాల్లో తమ రాష్ట్రానికి సాగునీటి హక్కు వస్తుందని కర్నాటక వాదిస్తోంది. ఆ నీటిని అప్పర్ భద్ర ప్రాజెక్టులో వినియోగించుకోవడానికి కర్నాటక కేంద్రానికి డీపీఆర్‌ను సమర్పించింది. కేంద్రం కూడా దీన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టేందుకు ముందుకు కదులుతోంది. వీటికి తోడు తుంగ, భద్ర కాల్వల అధునికీకరణ ద్వారా కూడా కొంత మేర కృష్ణా జలాలను తీసుకుంటోంది. దిగువ రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణాలను కూడా కర్నాటక కనీసం సంప్రదించలేదు. కృష్ణా జలాల కేటాయింపుపై సుప్రీం కోర్టులో స్టే ఉన్నా లెక్క చేయకుండా ముందుకు వెళ్తోంది