Sreeleela: న్యూడ్ బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ శ్రీలీల.. దగ్గుబాటి రానా పెట్టుబడి

Best Web Hosting Provider In India 2024


Sreeleela Signed To Neude Skincare Brand: దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెత హీరోయిన్లకు బాగా నప్పుతుంది. అందుకే వారికి ఫుల్ క్రేజ్ ఉన్నప్పుడే వివిధ అడ్వర్టైజ్‌మెంట్స్ చేస్తూ సంపాదించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. తాజాగా డాన్సింగ్ క్వీన్, ధమాకా బ్యూటి, హీరోయిన్ శ్రీలీల కూడా ఇదే ఫాలో అయినట్లు తెలుస్తోంది.

పాల ద్వారా చర్మ సంరక్షణ ఉత్పత్తులను తయారు చేసే సంస్థల్లో న్యూడ్ బ్రాండ్ ఒకటి (Neude Skincare Brand). న్యూడ్ బ్రాండ్‌లోని హై-గ్లేజర్ లైన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా శ్రీలల సైన్ చేసింది. దక్షిణ భారతదేశంలో శ్రీలలకు ఉన్న మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని తన సంస్థ ఉత్పత్తుల్లో అమ్మకాలను మెరుగుపరుచుకునేందుకు న్యూడ్ బ్రాండ్ శ్రీలీలను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

హీరోయిన్‌గా నటనతోనే కాకుండా, డ్యాన్స్‌తో మెస్మరైజ్ చేసే శ్రీలీల ఇందుకు పర్ఫెక్ట్ అని సంస్థ భావించినట్లు అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ న్యూడ్ సంస్థ గురించి, బ్రాండ్ అంబాసిడర్ గురించి శ్రీలీల చెప్పుకొచ్చింది. “నా చర్మ సంరక్షణ కోసం పాలను ఉపయోగిస్తూనే పెరిగాను. వీటితో న్యూడ్ సరికొత్త ఆవిష్కరణలను తీసుకురావడం సంతోషంగా ఉంది” అని శ్రీలీల తెలిపింది.

“నేటి చర్మ సంరక్షణ అవసరాలకు సరిగ్గా సరిపోయేలా న్యూడ్ అధిక పనితీరు గల ఉత్పత్తులను తయారు చేయడం బాగుంది. ఈ సరికొత్త చర్మ సంరక్షణ బ్రాండ్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. ఇంకా ఈ సంస్థతో ముందుకు వెళ్లడంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని శ్రీలీల పేర్కొంది.

పెరుగు, కోజిక్ యాసిడ్‌తో కూడిన ఫేస్ టైమ్ ఇన్‌స్టంట్ గ్లో మాస్క్, సన్ స్టాపబుల్ ఎస్పీఎఫ్ 45.. 3 ఇన్ 1 సన్‌స్క్రీన్, స్లీప్ ఆన్ ఇట్ ఓవర్ నైట్ గోట్ మిల్క్ సికా మాస్క్ లాక్టిక్ యాసిడ్, బకుచియోల్ స్కీన్ హెరిటెన్స్ బాడీ సీరమ్ వంటి న్యూడ్ ఉత్పత్తులు తనకు ఇష్టమని శ్రీలీల చెప్పుకొచ్చింది.

ఈ సందర్భంగా న్యూడ్ సౌత్‌బే టాలెంట్ సీఈఓ ప్రశాంత్ పొట్లూరి మాట్లాడారు. “న్యూడ్ స్కిన్ ప్రొడక్ట్స్ ప్రచారం కోసం సౌత్‌బే టాలెంట్‌తో శ్రీలీల చేతులు కలపడం మాకు చాలా సంతోషంగా ఉంది. రానా దగ్గుబాటి (Rana Daggubati) స్పిరిట్ మీడియా ద్వారా ఇందులో వ్యూహాత్మక పెట్టుబడి పెట్టారు. వీరిద్దరి కాంబినేషన్‌ న్యూడ్ జర్నీలో ఒక ఉత్తేజకరమైన కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తుంది” అని సీఈవో పొట్లూరి తెలిపారు.

న్యూడ్ బ్రాండ్ అంబాసిడర్‌గా శ్రీలీల (Sreeleela) ఎంపిక అవడం, అందులో దగ్గుబాటి రానా పెట్టుబడి పెట్టడం ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్‌గా మారింది. అయితే, గుంటూరు కారం సినిమా తర్వాత శ్రీలీలకు తెలుగులో ఒకటి రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి. దాంతో తమిళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే పనిలో ఉంది ఈ బ్యూటి. ఈ క్రమంలోనే రూట్ మార్చి ఇలా బ్రాండ్ అంబాసిడర్‌గా అడ్వర్టైజ్‌మెంట్స్‌తో సౌత్ ప్రేక్షకులకు చేరువ అయ్యే శ్రీలీల ఆలోచన చేస్తున్నట్లు టాక్.

కాగా పెళ్లి సందD సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల రవితేజ ధమాకా సినిమాతో సాలిడ్ హిట్ కొట్టింది. తర్వాత వరుసగా టాలీవుడ్‌లో ఆఫర్స్ అందుకుని క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.

టీ20 వరల్డ్ కప్ 2024


Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024