TV Premiere: టీవీలో ఓటీటీ బ్లాక్ బస్టర్ హారర్ ఫాంటసీ మూవీ.. ఎప్పుడు? ఎందులో చూడాలంటే?

Best Web Hosting Provider In India 2024


Ooru Peru Bhairavakona TV Premiere: థియేటర్‌లలో విడుదలైన సినిమాలు హిట్ అవ్వొచ్చు, ప్లాప్ కావొచ్చు లేదా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవచ్చు. థియేటర్లలో సినిమాల ఫలితం ఎలా ఉన్నా ఓటీటీల్లో మాత్రం కాస్తా భిన్నంగా ఉంటుంది. థియేటర్లలో హిట్ అయిన సినిమాలు ఓటీటీల్లో ట్రోలింగ్‌కు గురి అయితే.. ప్లాప్ టాక్ తెచ్చుకున్న మూవీస్ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటాయి.

అలా తెచ్చుకున్న సినిమానే ఊరు పేరు భైరవకోన. సందీప్ కిషన్ హీరోగా నటించిన హారర్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ ఊరు పేరు భైరవ కోన థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కానీ, మూవీలోని విజువల్స్‌కు మంచి అప్లాజ్ వచ్చింది. అయితే, ఓవరాల్‌గా మాత్రం ఊహించిన స్థాయిలో ఊరు పేరు భైరవ కోన అలరించలేకపోయింది. అనంతం ఓటీటీలో మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది ఈ మూవీ.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ రిలీజ్ రోజు నుంచే అత్యధిక వ్యూస్‌తో టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చింది ఊరు పేరు భైరవకోన. అంతేకాకుండా కొన్ని వారాల వరకు టాప్ ట్రెండింగ్ స్థానంలోనే కొనసాగింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ టాప్ 10 సినిమాల్లో ఏదో ఒక స్థానంలో నిలుస్తూ మంచి బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది ఈ మూవీ. అలాంటి ఈ సినిమా ఇప్పుడు బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అవుతోంది.

మొదట థియేటర్‌లలో.. ఆ తర్వాత ఓటీటీ అనంతరం టీవీల్లోకి సినిమాలు రావడం పరిపాటే. ఇప్పుడు ఊరు పేరు భైరవకోన అలాగే టీవీలో ప్రసారం కానుంది. ఇకపోతే ఆసక్తికరమైన మలుపులతో సాగే సీరియల్స్​, ఆకట్టుకునే రియాలిటీ షోలతోనే కాకుండా వారం వారం సరికొత్త సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న టీవీ ఛానెల్ జీ తెలుగు.

ప్రతి వారం కొత్త చిత్రాలతో ప్రేక్షకులకు వినోదం అందించే జీ తెలుగు ఈ ఆదివారం సూపర్​హిట్​ హారర్​ థ్రిల్లర్​​ అయిన ఊరు పేరు భైరవకోనతో ముందుకు రాబోతోంది. సందీప్​ కిషన్​, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఊరు పేరు భైరవకోన సినిమాని వరల్డ్​ టెలివిజన్​ ప్రీమియర్​గా అందిస్తోంది.

ఆసక్తికరమైన కథాంశంతో మిస్టరీ, అడ్వెంచరస్​ హారర్​ మూవీగా​ రూపొందిన ఊరు పేరు భైరవకోనను జూన్ 30,​ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో ప్రసారం చేయనున్నారు. ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా కథ బసవ పాత్ర చుట్టూ తిరుగుతుంది.

సినిమా కథ విషయానికొస్తే.. బసవ (సందీప్ కిషన్) తన స్నేహితుడు జాన్ (వైవా హర్ష)తో కలిసి ఓ దొంగతనం చేస్తాడు. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకుంటూ అనుకోకుండా భైరవకోన అనే ఊరిలోకి వస్తారు. అయితే, ఈ ఇద్దరితో పాటు గీత ( కావ్య థాపర్) కూడా ఆ ఊర్లోకి వస్తుంది.

ఇంతకీ, ఆ భైరవకోన ఊరు ప్రత్యేకత ఏంటి ? అక్కడ కనిపించే మనుషులు ఎవరు? గరుడ పురాణంలో కనపడకుండా పోయిన నాలుగు పేజీలకి భైరవకోనకి మధ్య ఉన్న సంబంధం ఏంటి ? అనే విషయాలు తెలియాలంటే ఈ ఆదివారం జీ తెలుగులో ప్రసారమయ్యే ఊరు పేరు భైరవకోన సినిమా చూడాల్సిందే!

ప్రధాన నటీనటుల అద్భుతమైన నటన, ఆకట్టుకునే కథాంశంతో ఫాంటసీ, డ్రామాగా ప్రేక్షకులను అలరించేందుకు ‘ఊరు పేరు భైరవకోన’ సిద్ధమైంది. విఐ ఆనంద్​ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సందీప్​ కిషన్​, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్​ ప్రధాన పాత్రలు పోషించగా, వైవా హర్ష, వెన్నెల కిశోర్, పి. రవిశంకర్ ఇతర కీలకపాత్రలు పోషించారు. ఈ ఎమోషనల్ హారర్ అండ్ రివేంజ్ డ్రామా ప్రేక్షకులను కచ్చితంగా ఎంటర్టైన్‌ చేయనుందని జీ తెలుగు టీమ్ చెబుతోంది.

టీ20 వరల్డ్ కప్ 2024

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024