Best Web Hosting Provider In India 2024

Tenant OTT streaming: టాలీవుడ్ లో సత్యం మూవీ ద్వారా పాపులర్ అయిన నటుడు రాజేష్ నటించిన సరికొత్త మిస్టరీ థ్రిల్లర్ మూవీ టెనెంట్. పొలిమేర 2 సినిమా తర్వాత అతడు అలాంటిదే ఓ భిన్నమైన జానర్లో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. థియేటర్లలో పెద్దగా సక్సెస్ సాధించని ఈ సినిమా ఇప్పటికే ఓ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు మరో ఓటీటీలోకి కూడా వస్తోంది.
టెనెంట్ ఓటీటీ రిలీజ్ డేట్
టెనెంట్ మూవీ ఇప్పటికే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. గత ఏప్రిల్ నెలలో థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కాగా.. నెలన్నర తర్వాత జూన్ 7 నుంచి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ ఓటీటీలోకి వచ్చింది. ఇక ఇప్పుడు వచ్చే శుక్రవారం (జూన్ 28) నుంచి ఆహా ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీయే వెల్లడించింది.
థియేటర్లలో పెద్దగా ఆదరణ లభించకపోయినా.. ఓటీటీలో మాత్రం ఈ సినిమాకు బాగానే రెస్పాన్స్ వస్తోంది. యుగంధర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఆహా ఓటీటీలోకి కూడా రాబోతోంది. ఈ సినిమాలో సత్యం రాజేష్ తోపాటు మేఘా చౌదరి, చందన పయ్యావుల, భరత్ కాంత్ లాంటి వాళ్లు నటించారు.
టెనెంట్ మూవీ కథ ఇదే…
గౌతమ్ (సత్యం రాజేష్) తన మరదలు సంధ్యను (మేఘా చౌదరి) పెళ్లి చేసుకొని హైదరాబాద్‌లో కాపురం పెడతాడు. అన్యోన్యంగా సాగిపోతున్న వారి కాపురంలో అనుకోకుండా విభేదాలు ఏర్పాడుతాయి. సంధ్యను హత్యకు గురవుతుంది. అదే రోజు గౌతమ్ పక్క ఫ్లాట్‌లో ఉండే రిషి (భరత్ కాంత్) కూడా బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు. రిషి ని ప్రేమించిన వైష్ణవి (చందన) కనిపించకుండా పోతుంది?
సంధ్యను హత్య చేసినందుకు పోలీసులను గౌతమ్‌ను అరెస్ట్ చేస్తారు. నిజంగానే సంధ్యను గౌతమ్ హత్య చేశాడా? రిషి, సంధ్యకు ఏమైనా సంబంధం ఉందా? ఈ కేసు వెనకున్న మిస్టరీని ఏసీపీ (ఎస్తేర్ నోర్హానా) ఎలా ఛేదించింది అన్నదే ఈ మూవీ కథ. మత్తు పదార్థాలకు బాసినగా మారి కొందరు తమ జీవితాల్ని ఎలా పాడుచేసుకుంటున్నారనే సందేశంతో దర్శకుడు యుగంధర్ ఈ మూవీని తెరకెక్కించాడు.
టీ20 వరల్డ్ కప్ 2024
Best Web Hosting Provider In India 2024
Source / Credits