Star Maa New Show: బాయ్స్ వర్సెస్ గర్ల్స్: కొత్త షో: 20 మంది కంటెస్టెంట్లు.. బిగ్‍బాస్‍తో పాటు సీరియల్ యాక్టర్లు కూడా..

Best Web Hosting Provider In India 2024


ప్రముఖ తెలుగు టీవీ ఛానెల్ ‘స్టార్ మా’ కొత్త రియాల్టీ గేమ్ షోను తీసుకొస్తోంది. గత వారమే ‘నీతోనే డ్యాన్స్ 2.0’ షో ఫినిష్ అయింది. దీంతో ఆ స్థానంలో ‘కిర్రాక్ బాయ్స్ – ఖిలాడీ లేడీస్’ గేమ్ షో తీసుకొస్తోంది. ఈ షోలోనూ బిగ్‍బాస్ కంటెస్టెంట్లతో పాటు కొందరు సీరియళ్ల నటీనటులు, యాంకర్లు పోటీపడుతున్నారు. పది మంది అబ్బాయిలు, పది మంది అమ్మాయిలు రెండు జట్లుగా తలపడనున్నారు. ఈ గేమ్ షోలో పాల్గొనే 20 మందిని స్టార్ మా ఛానెల్ తాజాగా వెల్లడించింది. ఆ వివరాలు ఇవే..

20 మంది ఎవరంటే..

‘కిర్రాక్ బాయ్స్ – ఖిలాడీ లేడీస్’ గేమ్ షోలో 20 మంది రెండు జట్లుగా తలపడనున్నారు. అబ్బాయిల టీమ్‍ ‘కిర్రాక్స్ బాయ్స్’లో బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్‍లో పాల్గొన్న యాక్టర్లు అంబటి అర్జున్, అమర్ దీప్ చౌదరీ, టేస్టీ తేజ, గౌతమ్ ఉన్నారు. కమెడియన్ యాదమరాజు, నటులు నిఖిల్, శ్రీకర్, రవితేజ, చైతూ, కిరణ్ కూడా కూడా ఈ టీమ్‍లో ఉన్నారు. అమ్మాయిల టీమ్ ‘ఖిలాజీ లేడీస్’లో బిగ్‍బాస్ కంటెస్టెంట్లు ప్రియాంక జైన్, శోభా శెట్టి ఉండగా..యాంకర్లు విష్ణుప్రియ, రితూ చౌదరి కూడా ఉన్నారు. సీరియల్ నటీమణులు పల్లవి గౌడ, ఆయేషా ఖాన్, ప్రేరణ, గోమతి, దీపిక, గోమతి కూడా ఈ జట్టులో కంటెస్టెంట్లుగా చోటు దక్కించుకున్నారు. ఈ షోకు శ్రీముఖి యాంకరింగ్ చేస్తున్నారు.

లీడర్లుగా శేఖర్, అనసూయ

అమ్మాయిలు, అబ్బాయిలు జట్లలో చెరో పది మంది కంటెంస్టెంట్లు ఉన్నారు. కిర్రాక్ బాయ్స్ టీమ్‍కు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, ఖిలాడీ లేడీస్ టీమ్‍కు అనసూయ భరద్వాజ్ లీడర్లుగా ఉన్నారు. ఈ రెండు టీమ్‍లు పరస్పరం ఛాలెంజ్‍లు విసురుకుంటూ.. గేమ్స్ ఆడుతూ ఈ షో సాగనుంది. విభిన్నమైన రౌండ్స్, టాస్కులు, ఛాలెంజ్‍లతో ఈ షో ఎంటర్‌టైనింగ్‍గా ఉంటుందని స్టార్ మా చెబుతోంది.

టెలికాస్ట్ ఎప్పుడు..

‘కిర్రాక్ బాయ్స్ – ఖిలాడీ లేడీస్’ గేమ్ షో జూన్ 29వ తేదీన షురూ కానుంది. ప్రతీ శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు స్టార్ మా ఛానెల్‍లో ప్రసారం కానుంది.

షాకిచ్చిన ప్రోమో

కిర్రాక్ బాయ్స్ – ఖిలాడీ లేడీస్’ ఫస్ట్ ఎపిసోడ్‍కు సంబంధించి ఇటీవల ఓ ప్రోమో వచ్చింది. ఇందులో రెండు టీమ్స్ ఛాలెంజ్‍లు విసురుకున్నట్టు ఉంది. మిరపకాయలు తినడం, ఏడ్వడం సహా కొన్ని ఛాలెంజ్‍లు ఈ ప్రోమోలో ఉన్నాయి. ఈ గేమ్ షో ప్రైజ్‍మనీ రూ.20లక్షలు అని యాంకర్ శ్రీముఖి ప్రకటించారు. అయితే, ఈ ప్రోమో చివర్లో శేఖర్ మాస్టర్, అనసూయ చేసుకున్న ఛాలెంజ్ షాకింగ్‍గా అనిపించింది. ఛాలెంజ్‍లో భాగంగా ముందుగా అనసూయ తాను వేసుకున్న బ్లేజర్ విప్పగా.. శేఖర్ మాస్టర్ షర్ట్ తీసేశారు. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. అక్కడున్న వారు కేకలతో గోల చేశారు. అయితే, ఈ ఛాలెంజ్ ఏంటి అనేది ఫుల్ ఎపిసోడ్‍లో చూడాలనేలా ప్రోమోను కట్ చేసింది టీమ్. మొత్తంగా ప్రోమోతోనే ‘కిర్రాక్ బాయ్స్ – ఖిలాడీ లేడీస్’ మంచి క్రేజ్ తెచ్చుకుంది.

టీ20 వరల్డ్ కప్ 2024

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024