Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: ఐరన్ లెగ్ ఆఫ్ ఏపీ ఎవరంటే అది నారా లోకేష్ మాత్రమే అని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ విమర్శించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కొండా రాజీవ్ మీడియాతో మాట్లాడారు.
సీఎం వైయస్ జగన్‌పై నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇలాగే మాట్లాడతే లోకేష్‌కు గుణపాఠం తప్పదన్నారు. లోకేష్‌వి పనికి మాలిన మాటలు. ప్రజా జీవితంలో ఉండేందుకు లోకేష్‌కు అర్హత లేదన్నారు. నారా లోకేష్ బాడీ లాంగ్వేజ్ అభ్యంతరకరంగా ఉందన్నారు. సభ్యత, సంస్కారం లేకుండా లోకేష్ ప్రవర్తన ఉందని ధ్వజమెత్తారు. రాజకీయాల్లో ఉండేందుకు లోకేష్‌కు అర్హత ఉందా? అని ప్రశ్నించారు. నారా లోకేష్ పచ్చి బూతులు మాట్లాడుతున్నాడు. లోకేష్‌కు వచ్చేది పచ్చి బూతుల భాష మాత్రమే అన్నారు. సీబీఎన్ అంటే చంద్రబాబు బూతుల నాయుడు అని పెట్టుకోండి అని సలహా ఇచ్చారు. ఆంధప్రదేశ్ అని స్పష్టంగా రాయలేని వ్యక్తి లోకేష్. లోకేష్ భాష చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు.