Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ ప్రభుత్వ విధానమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పాలనా వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. విశాఖ.. పరిపాలన రాజధానిగా ఉంటుందని, అమరావతిలో అసెంబ్లీ, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుందన్నారు. పాలనా వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. సీఎం వైయస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మూడు రాజధానుల నినాదంతోనే ఎన్నికలకు వెళ్తామన్నారు .
చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారిలా ఆలోచిస్తున్నారని చెప్పారు. ప్రజలను ఎల్లో మీడియా కన్ప్యూజ్ చేస్తోందని సజ్జల మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ కోసం కొందరు వాదనలు చేస్తున్నారు. ఎవరూ అపోహలకు గురికావాల్సిన పనిలేదు. కొందరు కావాలనే అయోమయం సృష్టిస్తున్నారు.