Dulquer Salmaan: మరో తెలుగు సినిమా చేయనున్న దుల్కర్ సల్మాన్.. వైజయంతీ మూవీస్ బ్యానర్‌లోనే!

Best Web Hosting Provider In India 2024

Dulquer Salmaan: మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్‍కు సీతారామం చిత్రంతో తెలుగులో గ్రాండ్ ఎంట్రీ దక్కింది. టాలీవుడ్‍లో తన తొలి చిత్రంతోనే దుల్కర్ భారీ హిట్ అందుకున్నారు. హను రాఘవవూడి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించిన సీతారామం బ్లాక్‍బస్టర్ అయింది. ఆ బ్యానర్‌తో దుల్కర్‌కు మంచి అనుబంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆ బ్యానర్ నిర్మించిన కల్కి 2898 ఏడీ చిత్రంలోనూ అతడు ఓ క్యామియో రోల్ చేశారు. ప్రస్తుతం తెలుగులోనే లక్కీ భాస్కర్ చిత్రం చేస్తున్నారు దుల్కర్. ఇప్పుడు, మరో తెలుగు మూవీకి ఓకే చెప్పారని తెలుస్తోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పైనే ఆ సినిమాను దుల్కర్ సల్మాన్ చేయనున్నారని సమాచారం. అనౌన్స్‌మెంట్ డేట్ కూడా బయటికి వచ్చింది.

పవన్ సాదినేనితో..

వైజయంతీ మూవీస్ పతాకంపై దుల్కర్ సల్మాన్ చేయనున్న ఈ చిత్రానికి పవన్ సాదినేని దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ప్రేమ ఇష్క్ కాదల్, సావిత్రి, సేనాపతి చిత్రాలకు పవన్ దర్శకత్వం వహించారు. క్రైమ్ థ్రిల్లర్ సేనాపతి ఓటీటీలోకి నేరుగా రాగా మంచి ప్రశంసలు దక్కించుకుంది. ఓ నాలుగు వెబ్ సిరీస్‍లకు కూడా పవన్ సాదినేని దర్శకత్వం వహించారు. అందులో దయా వెబ్ సిరీస్ చాలా సక్సెస్ అయింది. పవన్‍కు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇటీవలే వచ్చిన పరువు సిరీస్‍‍కు షోరన్నర్‌గా పవన్ సాదినేని ఉన్నారు.

ఇలా ఎక్కువగా ఓటీటీ ప్రాజెక్టులే చేసిన పవన్ సాదినేనితో దుల్కర్ సల్మాన్ సినిమా చేయనుండడం ఆసక్తికరంగా మారింది. ఈ మూవీ ఏ జానర్లో ఉంటుందనేది కూడా ఇంట్రెస్టింగ్ విషయంగా ఉండనుంది.

దుల్కర్ పుట్టిన రోజున..

దుల్కర్ – పవన్ సాదినేని – వైజయంతీ మూవీస్ కాంబినేషన్‍లో ఈ మూవీ అనౌన్స్‌మెంట్‍కు కూడా ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది. దుల్కర్ పుట్టిన రోజైన జూలై 28వ తేదీన ఈ చిత్రంపై అధికారిక ప్రకటన రానుందట. దీంతో ఆ రోజున తీసుకొచ్చే పోస్టర్‌తో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశాలు ఉంటాయి.

లక్కీ భాస్కర్‌లో బిజీ

దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం కూడా తెలుగు సినిమానే చేస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ చిత్రంలో దుల్కర్ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ఈ మూవీ టీజర్ ఇంట్రెస్ట్ పెంచింది. ఈ మూవీలో బ్యాంకు ఉద్యోగిగా దుల్కర్ పని చేస్తుంటారు. ఈ సినిమా షూటింగ్‍లో దుల్కర్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు.

లక్కీ భాస్కర్ చిత్రాన్ని సెప్టెంబర్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే వచ్చిన శ్రీమతి గారు సాంగ్ మంచి హిట్ అయింది. లక్కీ భాస్కర్ చిత్రంలో దుల్కర్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‍గా చేస్తున్నారు.

కల్కి 2లోనూ రోల్ ఉంటుందా!

కల్కి 2898 ఏడీ చిత్రంలో దుల్కర్ సల్మాన్ ఓ క్యామియో రోల్ చేశారు. చిన్నతనంలో భైరవ (ప్రభాస్)ను పెంచిన కెప్టెన్‍ పాత్రలో కనిపించారు. అయితే, సీక్వెల్ మూవీ కల్కి 2లోనూ దుల్కర్ పాత్ర ఉంటుందనే రూమర్లు ఉన్నాయి. ఈ చిత్రంలో ఈ క్యారెక్టర్ మరింత ఎక్కువసేపు ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024