
Best Web Hosting Provider In India 2024

CBN Revanth Meeting : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఉత్కంఠగా మారింది. విభజన సమస్యలతో పాటు రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు చర్చించనున్నారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ ప్రజాభవన్ లో ఈ భేటీ జరగనుంది. చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీలో ఏపీ నుంచి మంత్రులు అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్, బీసీ జనార్థన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ నీరభ్ కుమార్ ప్రసాద్, ఆర్థిక శాఖ కార్యదర్శితో పాటు పలు శాఖల కార్యదర్శులు, సీనియర్ అధికారులు పాల్గొనున్నారు. ఇక తెలంగాణ నుంచి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం సలహాదారులు, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, సీనియర్ అధికారులు పాల్గొనున్నారు.
సంబంధిత కథనం
టాపిక్