Online Betting : ఆన్ లైన్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు, ముగ్గురు అరెస్టు- రూ.33.10 లక్షలు స్వాధీనం

Best Web Hosting Provider In India 2024

Online Betting : పెద్దపల్లి జిల్లాలో ఆన్ లైన్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేశారు రామగుండం పోలీసులు. సుల్తానాబాద్ లో ముగ్గురిని అరెస్టు చేశారు. వారి నుంచి 33 లక్షల 10 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. సుల్తానాబాద్ బస్టాండ్ సమీపంలో ఎస్ఐ శ్రావణ్ కుమార్ , నరేష్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఆన్ లైన్ బెట్టింగ్ ముఠా పట్టుబడిందని రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్ తెలిపారు. రామగుండం పోలీస్ కమీషనరేట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టుబడ్డ వారిని చూపించి వివరాలు వెల్లడించారు. అనుమానాస్పదంగా వెళ్తో్న్న వాహనం ఆపి చెక్ చేయగా భారీ మొత్తంలో డబ్బులు బయటపడి ఆన్ లైన్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు అయిందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా రెడ్డికేశవరామునిపాలెంకు చెందిన నిమ్మ ధనుంజయ్, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ముల్కల రాజ్ కుమార్, చిన్నపల్లి అభిలాష్ ముగ్గురు యువకులను ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పకుండా ఉండడంతో అనుమానం వచ్చి వాహనం తనిఖీ చేయగా భారీగా నగదు పట్టుబడిందని తెలిపారు.

యాప్ ద్వారా ఆన్ లైన్ బెట్టింగ్

పట్టుబడిన ముగ్గురు ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ 55 క్లబ్, తిరంగా యాప్, 82 లాటరీ యాప్ ల ద్వారా బెట్టింగ్ కు పాల్పడ్డారు. ఆ యాప్ లను సోషల్ మీడియా వేదికలైన ఇన్ స్టాగ్రామ్, టెలిగ్రామ్ యాప్ ల ద్వారా ఫాలోవర్స్ కి బెట్టింగ్ యాప్స్ లింక్స్ పంపుతూ వాడిని ఆడేలా ప్రోత్సహించారు. యాప్ ని అమాయక ప్రజలు ఆడేలా ప్రత్యక్షంగా వాటిని ప్రమోట్ చేస్తూ వాటి ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. బెట్టింగ్ యాప్ లో వీరి అకౌంట్ కు జమ అయిన డబ్బును యూఎస్డీటీ (యూనైటేడ్ స్టేట్ డిపార్త్మేంట్ అఫ్ ట్రేసరి) ద్వారా బెట్టింగ్ యాప్ లకు వస్తున్న డబ్బును మనీ ట్రేడర్స్ ద్వారా హైదరాబాద్ నుంచి గోదావరిఖనికి తరలిస్తుండగా… సుల్తానాబాద్ లో వాహనాల తనిఖీలో పట్టుబడ్డారని చెప్పారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరికి సంబంధనే అంశంపై విచారణ జరుపుతున్నట్లు ప్రకటించారు.

రిపోర్టింగ్: కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్

Telangana NewsTrending TelanganaCrime NewsRamagundamTs Police
Source / Credits

Best Web Hosting Provider In India 2024