Best Web Hosting Provider In India 2024

అనపర్తి: అనపర్తి బహిరంగ సభలో చంద్రబాబు తీరు ఆక్షేపణీయమని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం రాష్ట్రానికి ఏం చెబుతుంది?. ప్రజల్ని రెచ్చగొట్టే రాజకీయం చేయమంటుందా? ఉచ్ఛనీచాలు మరిచిన చంద్రబాబు పిచ్చి పట్టినట్లు మాట్లాడి సీఎంగారు, స్థానిక ఎమ్మెల్యేను తూలనాడడాన్ని పార్టీ తరఫున మేమంతా ఖండిస్తున్నామన్నారు. అధికారం కోల్పోయిన ఫ్రస్టేషన్‌లో, ప్రజలు తనను ఏ మాత్రం ఆదరించడం లేదన్న దుగ్ధతో చంద్రబాబు మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడని అంతా అనుకుంటున్నారు. సీఎంగారిని నిందించడం, చివరకు తనకు భద్రత కల్పిస్తున్న పోలీసులపైనా పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్న చంద్రబాబు కనీసం మర్యాద అనేది లేకుండా వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు. శనివారం అనపర్తి నియోజకవర్గం వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, స్థానిక ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు.