NNS July 11th Episode: భాగీకి మల్లెపూలు పెట్టిన మనోహరి- అమర్‌కు మిస్సమ్మ ముద్దు- అరుంధతి అస్తికల కోసం ఘోరా ప్లాన్

Best Web Hosting Provider In India 2024

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 11th July Episode) అమర్​కి తనపై ప్రేమ పుట్టాలంటే ఏం చేయాలో చెప్పమని తన ఫ్రెండ్​ కరుణని అడుగుతుంది భాగీ. ఆ విషయం తనకి వదిలేయమని భాగీని అందంగా ముస్తాబుచేస్తుంది కరుణ.

మనోహరిని ఏడిపించి

మరీ అతిగా తయారయ్యానేమోనని ఫీలవుతున్న భాగీకి అమర్​ లాంటి మొండోడిని పడేయాలంటే ఈ మాత్రం ఉండాలని నచ్చజెప్పుతుంది. మల్లెపూలు పెట్టేందుకు మనోహరిని పిలుస్తుంది కరుణ. ఇప్పుడు మల్లెపూలు ఎందుకు అని అడుగుతుంది మనోహరి. అమర్​కి ఇష్టమని భాగీకి మల్లెపూలు పెడుతున్నానంటుంది కరుణ. భాగీ, కరుణ ఇద్దరూ కలిసి మనోహరిని ఏడిపిస్తారు.

తను వేరే టెన్షన్‌లో ఉండటం వల్ల ఏం అనలేకపోతున్నానని అక్కడనుంచి కోపంగా వెళ్లిపోతుంది మనోహరి. ముందుంది ముసళ్ల పండగ.. మనోహరిని అంత ఈజీగా వదలను అంటుంది భాగీ. నువ్వు పడిపోవాల్సింది, పట్టుకోవాల్సింది మీ ఆయనని అని భాగీని రూమ్​లోకి పంపిస్తుంది కరుణ. రూమ్​లోకి వస్తూనే బెడ్​పై పడిపోతుంది భాగీ. ఏమైందని అడుగుతాడు అమర్​.

ముక్కుపేలిపోయేలా కాదు

ఏం లేదు పడిపోయాను అంటుంది భాగీ. ఏంటీ.. ఈరోజు నీ పుట్టినరోజా? గుడికి వెళ్లావా? అని అడుగుతాడు అమర్​. బాగున్నావని చెప్పడానికి ఇవన్నీ అడగాలా? ఓ కాంప్లిమెంట్​ ఇస్తే సరిపోతుంది కదా అని మనసులో అనుకుంటుంది భాగీ. కాంప్లిమెంట్​ ఇవ్వడానికి కాదు, కొత్తగా కనిపిస్తుంటే అడిగాను అంటాడు అమర్​. పర్​ఫ్యూమ్.. అని అమర్ అనగానే బాగుందా? అంటుంది భాగీ. కాదు.. పర్​ఫ్యూమ్​ బాగుండేలా వేసుకుంటే చాలు.. ఇలా ముక్కు పేలిపోయేలా వేసుకోనక్కర్లేదు అంటాడు అమర్​.

తనని అమర్​ పిలుస్తాడని కావాలనే కింద పడుకుంటుంది భాగీ. కానీ, అమర్ పట్టించుకోకుండా ఉండటంతో సౌండ్​ చేసి డిస్టర్బ్​ చేస్తుంది భాగీ. అసలేమైంది.. ఎందుకు కింద పడుకున్నావు? ఎందుకు సౌండ్ చేస్తున్నావు? నీకు ఇబ్బందిగా ఉంటే వచ్చి పైన పడుకో అంటాడు అమర్​. ఈ మొండి మనిషి దగ్గర కరుణ ప్లాన్​ వర్కౌట్​ అవదు గానీ.. ఈయనకి నామీద కోపం ఉందో లేదో తెలుసుకుందాం అనుకుంటుంది.

ఎప్పటికీ క్షమించను

నేనంటే కోపం పోయిందా అని అడుగుతుంది భాగీ. నిన్ను మొదటిసారి చూసినప్పుడు నీకు లూజ్​ అనుకున్నాను. కానీ, నువ్వు పని మీద చూపే శ్రద్ధ, పిల్లలపై చూపించే ప్రేమ, ఓ కూతురిగా తీసుకున్న బాధ్యత చూసి మంచి దానివని అర్థం చేసుకున్నా. కానీ, నువ్వు నన్ను ముసుగు వేసుకుని మోసం చేసి పెళ్లి చేసుకున్నావు చూడు.. ఆ విషయంలో మాత్రం నిన్ను ఎప్పటికీ క్షమించను అంటాడు అమర్​.

వెంటనే అమర్​ కాళ్లకి దండం పెట్టి ఆ ఒక్క విషయం వదిలేయండి.. ఆరోజు అసలేం జరిగిందో నిజంగా నాకు గుర్తుకు లేదు అని తండ్రి మీద ప్రమాణం చేస్తుంది భాగీ. సరే.. నీకు నిద్ర రావట్లేదేమోగాని, నాకు నిద్రొస్తుంది అని పడుకుంటాడు అమర్​. మీకు నా మీద ప్రేమ, గౌరవం ఉన్నాయని అర్థమైంది. మీరు బయట పడేవరకు ఇలా మీకు తెలియకుండా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను అనుకుంటుంది భాగీ.

ఆత్మ అస్తికలు చేజిక్కించుకుంటే

మరోవైపు ఆత్మను బంధించేందుకు మళ్లీ ప్రయత్నాలు మొదలుపెడతాడు ఘోరా. ఎన్నో సాధించిన తనకు ఒక ఆత్మను బంధించడం ఎందుకు ఇంత కష్టమవుతుందో చెప్పమని తన గురువుని ప్రశ్నిస్తాడు. ఒక ఆత్మను బంధించలేని శక్తులు, ఆత్మ ముందు ఓడిపోతున్న పూజలు, మానవుడి ముందు కూడా తలవంచే ఈ దీక్షలు వద్దంటూ ఆత్మాహుతికి సిద్ధమవుతాడు. శక్తులు కావాలంటే సహనం, గెలవాలంటే ఓర్పు ఉండాలని ఘోరాకి నచ్చజెప్పుతాడు గురువు.

తనకి అనుకూల సమయం త్వరలోనే వస్తుందని చెబుతాడు. ఆత్మ అస్తికలు చేజిక్కించుకుంటే తప్పకుండా గెలుస్తావని అంటాడు గురువు. ఎవరు అడ్డుపడినా అస్తికలు తీసుకోకుండా తనని ఎవరూ ఆపలేరంటాడు ఘోరా. అమర్​ భాగీని ప్రేమగా ముద్దు పెట్టుకున్నట్లు కలగంటుంది మనోహరి. వెంటనే ఉలిక్కిపడి లేచి ఇలాంటి కల వచ్చిందేంటి, ఉదయాన్నే వచ్చిన కల నిజమవుతుందంటారే.. అని కంగారు పడుతుంది.

ఆటపట్టించేందుకు

అమర్​ ఎట్టిపరిస్థితుల్లో భాగీకి దగ్గరవడు అంటూ తనకి తానే నచ్చజెప్పుకుంటుంది. లోపల ఏం జరుగుతుందోనని కంగారుగా అమర్​ గది బయటే తిరుగుతుంది. లేవగానే అమర్​ని చూసి మురిసిపోతుంది భాగీ. కంగారులో చీరతట్టి పడబోతూ అమర్​కి ముద్దు పెడుతుంది. అమర్​ చెంపమీద పడిన లిప్​స్టిక్​ మరకని తుడవబోతూ మనోహరిని ఆటపట్టించడానికి ఇదో మంచి అవకాశం అంటూ సంబరపడుతుంది.

అమర్​ చెంపమీద ఉన్న లిప్​స్టిక్​ మార్క్​ చూసి మనోహరి ఏం చేస్తుంది? అరుంధతి అస్తికలు చేజిక్కించుకోవడానికి ఘోరా ఏం చేయనున్నాడు? అనే విషయాలు తెలియాలంటే జులై 12న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024