Best Web Hosting Provider In India 2024

Political Drama OTT: నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ రాజేష్ రిజి నాయర్ మలయాళంలో ఓ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించబోతున్నాడు. జై మహేంద్రన్ పేరుతో రూపొందుతోన్న ఈ మలయాళం సిరీస్‌లో సాజుకురుప్, మియాజార్జ్‌తో పాటు సుహాసిని మణిరత్నం కీలక పాత్రలు పోషించబోతున్నారు.
ప్రభుత్వ అధికారుల్లోని లంచగొండితనం, అవినీతి చర్చిస్తూ థ్రిల్లర్ కథాంశంతో జై మహేంద్రన్ సిరీస్ రూపుదిద్దుకోనుంది. సోనీలివ్‌లో రిలీజ్ కాబోతున్న ఫస్ట్ మలయాళం వెబ్‌సిరీస్ ఇదే కావడం గమనార్హం. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
అవినీతి అధికారి కథ…
ఇందులో మహేంద్రన్ అనే అవినీతి పరుడైన ఎమ్ఆర్ఓ పాత్రలో సాజు కురుప్ కనిపించబోతున్నాడు. లంచగొండి అయిన మహేంద్రన్ అనుకోకుండా ఉద్యోగం కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ సమస్య నుంచి బయటపడేందుకు మహేంద్రన్ ఏం చేశాడు? అతడు చేసిన పనికి ప్రభుత్వ కూలిపోయే ప్రమాదం తలెత్తడానికి కారణం ఏమిటనే అంశాలతో జై మహేంద్రన్ సిరీస్ తెరకెక్కుతోంది.
జై మహేంద్రన్‌కు రాజేష్ రిజి నాయర్ కథను అందిస్తూనే ఈ వెబ్‌సిరీస్‌ను ప్రొడ్యూస్ చేస్తోన్నాడు. గతంలో మలయాళంలో రిలీజైన కేరళ క్రైమ్ ఫైల్స్ వెబ్‌సిరీస్‌కు రాజేష్ రిజి నాయర్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. శ్రీకాంత్ మోహన్ దర్శకత్వం వహించాడు.
నేషనల్ అవార్డ్…
రాజేష్ రిజి నాయర్ దర్శకత్వం వహించిన కొల్ల నొట్టమ్ మూవీ బెస్ట్ మలయాళం మూవీగా నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నది. ఖోఖో, కీడమ్ సినిమాలతో కమర్షియల్ హిట్స్ అందుకున్నాడు.
వెబ్ సిరీస్ స్ట్రీమింగ్…
జై మహేంద్రన్ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌పై సోనీ లివ్ ఆఫీషియల్‌గా క్లారిటీ ఇచ్చింది. ఆగస్ట్‌లో ఈ పొలిటికల్ డ్రామా సిరీస్ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రానున్నట్లు ప్రకటించింది. తొలుత జై మహేంద్రన్ వెబ్‌సిరీస్‌ను ఫిబ్రవరి లేదా మార్చిలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ ఇందులోని కొన్ని డైలాగ్స్, సీన్స్‌పై పొలిటికల్ పార్టీలు, ప్రభుత్వం నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం ఉండటంతో ఆ సీన్స్‌ను రీ షూట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే రిలీజ్ ఆలస్యమైనట్లు సమాచారం.
ఓటీటీలోకి ఎంట్రీ…
మలయాళంలో వందకుపైగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా నటించాడు సాజు కురుప్. తమిళంలో తని ఒరువన్, ఆదిభగవన్ సినిమాలు చేశాడు. జై మహేంద్రన్ వెబ్‌సిరీస్‌తోనే సాజు కురుప్ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
Best Web Hosting Provider In India 2024
Source / Credits