ఇది సూపర్ సిక్సా? లేక సూపర్‌ మోసమా?

Best Web Hosting Provider In India 2024

మాజీ మంత్రి అంబటి రాంబాబు

ప్రతిపిల్లవాడు చదువుకోవాలనే ఉద్దేశంతో వైయ‌స్ జ‌గ‌న్ సంస్కరణలు తీసుకొచ్చారు

వైయ‌స్‌ జగన్‌ అధికారంలో ఉంటే ఇప్పటికే అమ్మఒడి అందించేవారు

వాగ్దానాలను తుంగలోకి  తొక్కిన  మోసగాడు చంద్రబాబు

చంద్రబాబు చేసిన మోసాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి

చంద్రబాబుకు ఓట్లేసిన వారు ఆయన చేసిన మోసాలను గుర్తించాలి

ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు
 

తాడేప‌ల్లి: ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు ఇచ్చింది  ఇది సూపర్ సిక్సా? లేక సూపర్‌ మోసమా? అని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ప్ర‌శ్నించారు.  పిల్లలని స్కూల్ కి పంపే అమ్మలకు ‘తల్లికి వందనం’ పథకం కింద రూ. 15,000 ఆర్థిక సహాయం అంటూ ఏపీ ప్ర‌భుత్వం జీవో 29 పేరిట ఉత్తర్వులు జారీ చేసింది. అయితే..  ఎన్నికల ముందు ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలంటే అందరికి తల్లికి వందనం ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక మాట మార్చార‌ని మాజీ మంత్రి మండిప‌డ్డారు. గురువారం అంబ‌టి రాంబాబు మీడియాతో మాట్లాడారు.

విద్యారంగంలో అనేక మార్పులు తీసుకురావాలని వైయ‌స్ జ‌గ‌న్ ప్రయత్నించారని.. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు అలవాటైన మోసాలను ప్రదర్శిస్తున్నారు.  రాష్ట్రంలో అక్షరాస్యత పెంపొందించడానికి  వైయ‌స్‌ జగన్‌ కృషి  చేశారు. ప్రతిపిల్లవాడు చదువుకోవాలనే ఉద్దేశంతో సంస్కరణలు తీసుకొచ్చారు. ఇప్పుడ సీఎం  చంద్రబాబు ఎలాంటి జీవో ఇచ్చారో ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి. కేవలం ప్రతి తల్లికి రూ. 15 వేలు మాత్రమే ఇస్తానని జీవో ఇచ్చారు. ఇది సూపర్ సిక్సా? లేక సూపర్‌ మోసమా?. 

ఇచ్చిన వాగ్దానాలను తుంగలోకి  తొక్కిన  మోసగాడు చంద్రబాబు. మోసం చేయటం చంద్రబాబుకు అలవాటు. వైయ‌స్‌ జగన్‌ అధికారంలో ఉంటే ఇప్పటికే అమ్మఒడి అందించేవారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్  కూడా ప్రతి విద్యార్థికి రూ. 15 వేలు ఇస్తామన్నారు. సూపర్‌ సిక్స్‌ అని ప్రచారం చేశారు.. అవి ఏమయ్యాయి?. నిరుద్యోగభృతి ఇస్తానన్న హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాల్సిందే.

 42లక్షల 61వేల మంది తల్లుల ఖాతాలో వైయ‌స్‌ జగన్ నగదు జమ చేశారు. జనాన్ని మోసం చేయటంలో సీఎం చంద్రబాబు దిట్ట. మోసాలు చేయటం అలవాటు పడిన చీటర్ చంద్రబాబు. చంద్రబాబుకు ఓట్లేసిన వారు ఆయన చేసిన మోసాలను గుర్తించాలి. హామీలను అమలు చేయలేక వైఎస్‌ జగన్‌ను చంద్రబాబు దూషిస్తున్నారు. చంద్రబాబు చేసిన మోసాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. 

 చంద్రబాబు ఇచ్చిన జీవోని మార్చాలి. జీవోలో ప్రతి‌ తల్లికి అనే పదం తీసేసి ప్రతి విద్యార్థికి అని చేర్చాలి. క్యాలెండర్‌ ప్రకారం సంక్షేమాన్ని అమలు చేసిన ఘనత వైయ‌స్‌ జగన్‌ది. మోసం చేయటానికి అడ్డగోలు హామీలు ఇచ్చిన ఘనత చంద్రబాబుది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. కచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామ‌ని అని అంబటి అన్నారు.

 మాట మార్చిన చంద్ర‌బాబు
పిల్లలని స్కూల్ కి పంపే అమ్మలకు ‘తల్లికి వందనం’ పథకం కింద రూ. 15,000 ఆర్థిక సహాయం అంటూ జీవో 29 పేరిట ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు సర్కార్‌. అయితే..  ఎన్నికల ముందు ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలంటే అందరికి తల్లికి వందనం ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక మాట మార్చారు!.

 పిల్లలను బడికి పంపే తల్లుల విషయంలో వైయ‌స్ జగన్‌ సర్కార్‌ మోసం చేస్తోందని, తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే.. అంతమంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం వర్తింపజేస్తామంటూ చంద్రబాబు గత రెండేళ్లుగా చెబుతూ వచ్చారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా దీనిని బాగా ప్రచారం చేశారు. ఎన్నికల టైంలో కూటమి అభ్యర్థులు సైతం ఈ అంశాన్ని తమ ప్రచార అంశంగా మార్చుకున్నారు. ప్రస్తుత  ఇరిగేషన్‌ మంత్రి నిమ్మలరామానాయుడు స్వయంగా ఒక ఇంటి దగ్గరికి వెళ్లి..  ఆ ఇంట్లో పిల్లలను చూపిస్తూ.. నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు.. అంటూ ఇంట్లో అందరికీ పథకం వర్తిస్తుందని లెక్కలు సైతం చెప్పారు.

ఒక్కో త‌ల్లికి రూ.15 వేలు మాత్ర‌మే అంటూ మెలిక‌..
కానీ, పథకం విధివిధానాల ప్రకారం.. ఒక్కో తల్లికి రూ.15,000 మాత్రమే ఆర్థిక సహాయం అంటూ మెలిక పెట్టారు. జీవో 29 ప్రకారం.. ఒక ఇంట్లో ఆధార్‌ కార్డు ఆధారంగా (ఆధార్‌ లేకుంటే దరఖాస్తు చేసుకోవాలని.. అది వచ్చేలోపు పది రకాల కార్డుల్ని అనుమతిస్తామని చెప్పారు) తల్లులకు తల్లికి వందనం వర్తింపజేయనున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం పేర్కొంది. అంటే.. ఒక ఇంటికి రూ.15వేలు.. ఇంట్లో ఒక్కరికే వర్తింపజేయడమన్నమాట. 

అలాగే.. వైట్ రేష‌న్‌కార్డు ల‌బ్ధిదారుల‌కే ప‌థ‌కం వ‌ర్తిస్తుంద‌ని ప్ర‌భుత్వం తెలిపింది.  ఇంతకు ముందు వైయ‌స్ జగన్‌ ప్రభుత్వం చేసింది కూడా ఇదే కదా!. కాకపోతే ఇప్పుడు ఆధార్‌ కార్డును తప్పనిసరిగా అనుసంధానం చేయాలని ప్రత్యేకంగా పేర్కొనడంతో పాటు విద్యార్థికి 75 శాతం హాజ‌రు త‌ప్ప‌నిస‌రి, పేదరికం దిగువన లాంటి అంశాల్ని ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఈ పథకం అమలుపైనా ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన తల్లిదండ్రుల్లో ప్రభుత్వ మార్గదర్శకాలతో గందరగోళం నెలకొనగా, రానున్న రోజుల్లో ఇది లబ్ధిదారులకు కోత పెట్టే చంద్రబాబు మాయేనన్న చర్చ మరోవైపు నడుస్తోంది.

Best Web Hosting Provider In India 2024