Kalki 2898 AD Box Office: ఎట్టకేలకు 1000 కోట్లు కొల్లగొట్టిన కల్కి 2898 ఏడీ.. ఇక ఇండియన్ 2తో పోటీ.. లాభాలు ఇంతే!

Best Web Hosting Provider In India 2024

Kalki 2898 AD Box Office Collection: ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటించిన కల్కి 2898 ఏడీ చిత్రం థియేటర్లలో సత్తా చాటుతోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 870 కోట్లు (గ్రాస్) వసూలు చేసిందని ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, గురువారం (జూలై 11) నాటికి దేశీయంగా కల్కి సినిమా రూ. 543 కోట్లు (నెట్ ఇండియా కలెక్షన్స్) వసూలు చేసింది.

15 రోజుల్లో వెయ్యి కోట్లు

ఇక ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ప్రకారం ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పరంగా రూ. 1,000 కోట్ల మార్కును దాటింది. 15 రోజుల్లో కల్కి సినిమా కలెక్షన్స్ వెయ్యి కోట్లు దాటిందని రమేష్ బాలా తన ఎక్స్ అకౌంట్ వేదికగా చెప్పుకొచ్చారు. “#KALKI2898AD వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 1,000 కోట్లు దాటింది” అని రమేష్ బాలా ఎక్స్‌లో రాసుకొచ్చారు.

డే 15 నెట్ కలెక్షన్స్

ఇదిలా ఉంటే కల్కి సినిమా ఒక్క 15వ రోజునే దేశీయంగా రూ. 6.7 కోట్ల నెట్ కలెక్షన్స్ రాపట్టింది. వీటిలో తెలుగు నుంచి రూ. 1.55 కోట్లు, తమిళం నుంచి ఆరు లక్షలు, కన్నడ నుంచి లక్ష, మలయాళం నుంచి 35 లక్షలతోపాటు హిందీ నుంచి అధికంగా రూ. 4 కోట్లు ఉన్నాయి. ఇక 15 రోజుల్లో రాబట్టిన దేశీయ బాక్సాఫీస్ వసూళ్లు రూ. 543.45 కోట్లు (నెట్), రూ. 638.5 కోట్లు (గ్రాస్)గా నమోదయ్యాయి.

కల్కి 2898 ఏడీ ప్రాఫిట్స్

వీటిలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో వరుసగా రూ.253.85 కోట్లు, రూ.32.2 కోట్లు, రూ.232.9 కోట్లు, రూ.4.5 కోట్లు, రూ.20 కోట్లుగా ఉన్నాయి. అలాగే కల్కి సినిమా గత పదిహేను రోజుల్లో ఓవర్సీస్‌లో రూ.232 కోట్లు వసూలు చేసింది. ఇక కల్కి 2898 ఏడీ సినిమా ద్వారా నిర్మాత సి అశ్వనీదత్‌కు ఇప్పటివరకు రూ. 90 కోట్ల లాభాలు వచ్చినట్లు ట్రేడ్ వర్గాల గణాంకాలు చెబుతున్నాయి.

ఇండియన్ 2తో పోటీ

అయితే, ఇవాళ కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 వరల్డ్ వైడ్‌గా చాలా గ్రాండ్‌గా విడుదలైంది. నేటి నుంచి కల్కి 2898 ఏడీ, భారతీయుడు 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. కల్కి 15 రోజుల్లో వెయ్యి కోట్లు కొల్లగొట్టగా.. ఇండియన్ 2 ఎన్ని రోజుల్లో ఈ మార్క్ చేరుకుంటుందో చూడాలి.

సెలబ్రిటీల ప్రశంసలు

ఇదిలా ఉంటే, ‘కల్కి 2898 ఏడీ‘ విడుదలైనప్పటి నుంచి అభిమానులు, చిత్ర పరిశ్రమ నలుమూలల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపిస్తూ పొగుడుతున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ పోస్ట్ అపోకలిప్టిక్ చిత్రం హిందూ పురాణాల నుంచి ప్రేరణ పొందిన విషయం తెలిసిందే.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024