AP Degree Admissions : ఏపీలో డిగ్రీ ప్రవేశాలు – కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ పొడిగింపు, ముఖ్య తేదీలివే

Best Web Hosting Provider In India 2024

AP OAMDC Admissions 2024: ఆంధ్రప్రదేశ్‌లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ డిగ్రీ ప్రవేశాలకు కౌన్సిలింగ్ కొనసాగుతోంది. జూన్ 18 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కాగా… తాజాగా షెడ్యూల్ గడువును అధికారులు పొడిగించారు.

 

ముఖ్య తేదీలు…

ఉన్నత విద్యా మండలి నిర్ణయం ప్రకారం…. రిజిస్ట్రేషన్‌ కోసం జులై 20వ తేదీ వరకు అవకాశం కల్పించారు. అర్హత ఉన్న విద్యార్థులు ఈ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ప్రత్యేక కేటగిరీ ధ్రువపత్రాల పరిశీలన జులై 18 నుంచి 20 తేదీల్లో నిర్వహిస్తారు. జులై 23 నుంచి 26వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. జులై 31వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది.

2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్, అటానమస్ డిగ్రీ కాలేజీల్లో సాధారణ డిగ్రీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తున్నారు. మొత్తం మూడు దశల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఇంటర్మీడియట్ లో 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు మొదట దశలో ప్రవేశాలను కల్పించారు. 80 శాతం – 90 శాతం మధ్య మార్కులు సాధించిన విద్యార్థులకు రెండో దశలో అడ్మిషన్లు ఇవ్వగా…. 80 శాతం కంటే తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు మూడో మరియు చివరి దశలో ప్రవేశాలు ఉంటాయి. రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కాలేజీల్లో 3.19 లక్షల సీట్లు ఉండగా, గతేడాది 1.53 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఆన్‌లైన్ అడ్మిషన్ మాడ్యుల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఏఏండీసీ) ద్వారా ఈ ప్రవేశాలను ప్రక్రియ కొనసాగుతోంది.

 

అర్హత ఉన్న విద్యార్థులు https://oamdc-apsche.aptonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.ఇందుకోసం బీసీ విద్యార్థులు రూ. 300, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.200, జనరల్ కేటగిరీ (ఓసీ) విద్యార్థులు రూ.400 ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాలి. ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసే సమయంలో విద్యార్థులు తమ ఇంటర్మీడియట్ మార్కు షీట్, కుల ధృవీకరణ, ఇతర‌ అవసరమైన పత్రాలు స్కాన్ చేసిన కాపీలను తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి.

ఏపీ పాలిసెట్ ప్రవేశాలు…

ఏపీ పాలిసెట్ ఎంట్రెన్స్ లో అర్హత సాధించిన అభ్యర్థులు తుది దశ కౌన్సెలింగ్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జులై 11వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. జులై 13వ తేదీ వరకు ఆన్ లైన్ లో ఫీజు పేమెంట్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. జులై 14వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. జులై 16వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. జులై 18వ తేదీ నుంచి 20 తేదీల మధ్య కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

తుది దశ కౌన్సెలింగ్ – ముఖ్య తేదీలు

  • ఆన్‌లైన్ పద్ధతిలో ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు – జులై 11 – జులై 13, 2024.
  • ధ్రువపత్రాల పరిశీలన – జులై 11 – జులై 13, 2024.
  • వెబ్ ఆప్షన్లు – జులై 11 – జులై 14, 2024.
  • సీట్ల కేటాయింపు – జులై 16, 2024.
  • కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సిన తేదీలు – జులై 18 -20, 2024.

తుది దశ కౌన్సెలింగ్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు https://appolycet.nic.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. ఇప్పటికే ఏపీ పాలిసెట్ తరగతులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. 2024-25 విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్‌ నిర్వహించారు. మూడేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్ నిర్వహించారు

 

ఏపీలో పాలిసెట్ పరీక్షకు మొత్తం 1,42,035 మంది విద్యార్ధులు ప్రవేశ పరీక్షకు హాజరుకాగా, 87.61 శాతం మేర 1,24,430 మంది అర్హత పొందారు. వీరిలో బాలికలు 56,464 మంది పరీక్షకు హాజరుకాగా, 89.81 శాతం మంది, బాలురలో 85,561 మంది హాజరుకాగా 86.16 శాతం అర్హత పొందారు.

ఏపీ పాలిసెట్ 2024 కౌన్సిలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఫీజు చెల్లించిన రశీదు, హాల్‌ టికెట్, ర్యాంక్ కార్డు, పదో తరగతి ఉత్తీర్ణత ధృవపత్రం, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, అర్హులైన వారికి ఈడబ్ల్యుఎస్‌ ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ, ప్రత్యేక క్యాటగిరీ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

How to Check AP POLYCET 2024 Result – ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి

  • ఏపీ పాలిసెట్ పరీక్ష రాసిన విద్యార్థులు https://apsbtet.ap.gov.in లేదా https://polycetap.nic.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోంపేజీలో కనిపించే ‘AP POLYCET 2024 Result’ లింక్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
  • సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ ఆప్షన్ పై నొక్కి మీ ర్యాంక్ కార్డు కాపీని పొందవచ్చు.
  • అడ్మిషన్ల ప్రక్రియలో ర్యాంక్ కార్డు కీలకం. జాగ్రత్తగా ఉంచుకోవాలి.

 

 

 

WhatsApp channel
 

టాపిక్

 
Andhra Pradesh NewsAdmissionsEducationAp Polycet
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024