
Best Web Hosting Provider In India 2024

హిందూమతంలో రుద్రాక్షకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది శివుని కన్నీటి బిందువు నుండి పుట్టిందని చెబుతారు. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఏక ముఖి రుద్రాక్ష మొదలుకుని 21 ముఖి రుద్రాక్షలు కూడా ఉంటాయి. రుద్రాక్షల మీద ఉండే గాట్లు ఆధారంగా వాటికున్న ముఖాలను నిర్ణయిస్తారు. మనం ఎక్కువగా వినేవి ఏక ముఖి, పంచముఖి మాత్రమే. నాలుగు ముఖాల నుంచి ఏడు ముఖాలుండే రుద్రాక్షలు మాత్రం ఎక్కువగా దొరుకుతాయి.
రుద్రాక్ష అనే పదంలో రుద్ర అంటే శివుడు, అక్ష అంటే కన్నీరు. ఆద్యాత్మికంగా చాలా పనులు నెరవేరడానికి రుద్రాక్షను ధరించాలని చెబుతారు. అయితే వీటిని బోలెడంత ఖరీదు పెట్టి కొంటాం. అవి నకిలీవో అసలువో అనే సందేహం మాత్ర ఉంటుంది. అందుకే రుద్రాక్షలు అసలైనవో కావో తెల్సుకోడానికి కొన్ని మార్గాలున్నాయి. అవేంటో చూడండి.
నకిలీ రుద్రాక్షలు ఎందుకు చేస్తారు?
ఉదాహరణకు 12 ముఖాలున్న రుద్రాక్ష ధర వేలల్లో ఉంటే 20 ముఖాలున్న రుద్రాక్ష ధర లక్షల్లో ఉంటుంది. ఇలాంటి లాభాల కోసం చాలా రకాల మోసాలు జరుగుతాయి. అవేంటో తెల్సుకోవాల్సిందే. ఆకారాల్లో మార్పులు తీసుకురావడం ఒకరకమైన కల్తీ అయితే, ఆర్టిఫిషియల్ రుద్రాక్షలు.. అంటే ఏదైనా వేరే మెటీరియల్, పోకల్లాంటి వాటితో రుద్రాక్షలు తయారు చేసినవి అమ్మడం మరో మోసం. వాటిని గుర్తించడానికి మార్గాలున్నాయి.
నీటితో పరీక్ష:
రుద్రాక్షకు ఎక్కువ ముఖాలుంటే వాటి ధర పెరుగుతుంది. కాబట్టి కొందరు రుద్రాక్షలను గమ్ తో అతికించి ఎక్కువ ముఖాలున్న రుద్రాక్షగా అమ్ముతారు. వాటి కల్తీ తెల్సుకోవడానికి నీళ్లలో కనీసం పదిహేను నుంచి పదహారు గంటలుంచాలి. అప్పుడు అవి విడిపోయినట్లు, రంగు తేలినట్లు కనిపిస్తాయి.
లేదంటే రుద్రాక్ష పూసను టెస్ట్ చేయడానికి నీటిలో ముంచి కొన్ని గంటలు మరిగించాలి. రుద్రాక్ష రంగు ఏమాత్రం మారకపోతే, గుర్తించదగిన మరే మార్పులు లేకపోతే అది అసలైన రుద్రాక్ష కావచ్చు. అలాగే మరో రకంగానూ పరీక్షించవచ్చు. ఒక లోతైన గిన్నె నీటిలో రుద్రాక్ష దండను ఉంచండి. రుద్రాక్షలు పూర్తిగా మునిగిపోతే, అది నిజమైనదని నమ్ముతారు. నఖిలీవైతే నీటిలో తేలుతాయి.
పరీక్షించడం ద్వారా:
అసలైన రుద్రాక్ష రంగు పైనుంచి పక్కన, చివరి దాకా ఒకేలా ఉంటుంది. రంగుల్లో తేడా ఉంటే గమనించాలి. అలాగే ఉదాహరణకు పంచముఖి రుద్రాక్ష తీసుకుంటే పైన రంధ్రం పక్కన ఎలాగైతే 5 భాగాలున్నట్లు గీతల్లాగా కనిపిస్తాయో అవి పైనుంచి కింది దాకా ఉండాలి.
చెక్కినట్లుండే ఆకారాలు:
రుద్రాక్షల మీద ఓంకారం, త్రిషూలం, పాము లాంటి ఆకారాలు చెక్కినట్లుగా ఉంటాయి. వాటికి ప్రత్యేక శక్తులుంటాయని, పవిత్రమైనవని చెప్పి బోలెడంత ధర చెప్పి అమ్ముతారు. అవన్నీ నకిలీవే. అసలైన రుద్రాక్షల మీద అలాంటి ఆకారాలు ఉండటం అసాధ్యం.
రుద్రాక్ష చెట్లు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి?
రుద్రాక్ష విత్తనం రూపంలో వస్తుంది. అంటే పండు నుంచి వచ్చే విత్తనాలే రుద్రాక్షలు అన్నమాట. దీని చెట్లు పర్వత ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తాయి. భారతదేశంతో పాటు, నేపాల్, బర్మా, థాయిలాండ్ లేదా ఇండోనేషియాలో రుద్రాక్ష చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి.
టాపిక్