Ambani’s wedding food: అంబానీ పెళ్లి భోజనంలో 2500 పైగా వంటలు.. ఏమేం స్పెషల్స్ ఉన్నాయో చూడండి..

Best Web Hosting Provider In India 2024

ఈరోజు రాధిక మర్చంట్, అనంత్ అంబానీల వివాహం. ప్రి వెడ్డింగ్ వేడుకలనే అంతర్జాతీయ తారలతో అంగరంగవైభవంగా జరిపించారు. ఇక పెళ్లి గురించి మనకు ఊహకు అందని సెలెబ్రిటీలు తరలి రావడం, ఘనంగా ఏర్పాట్లు జరగడం ఊహించొచ్చు. అయితే ఇంతమంది గొప్ప గొప్ప ప్రముఖులకు విందు ఏర్పాటు ఎలా ఉంటుందోనని ఆసక్తిగా ఉంది కదూ. ఆ విందుకు సంబంధించిన మెన్యూ చూసేయండి.

అల్పాహారానికి:

ఆలూ పూరీ

చోలే బటూరే

పోహా జిలేబీ

కచోరీ సబ్జీ

వీటితో పాటూ మరెన్నో వెరైటీలు ఉండనున్నాయి. పెళ్లి విందులో దాదాపు 2500 రకాల కన్నా ఎక్కువ వంటకాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇంటర్నేషల్ వంటకాలతో పాటూ సాంప్రదాయ భారతీయ వంటకాలూ ఉన్నాయందులో. ఇక అందులో ఒక డిష్ తప్పకుండా ఉంటుంది. అదే నీతా అంబానీకి నచ్చిన వారణాశి టమాటా చాట్. కొన్ని రోజుల క్రితమే నీతా కాశీ వీధుల్లో స్ట్రీట్ ఫుడ్ ఆస్వాదించారు.

టమాటా చాట్ తో పాటే ఆలూ టిక్కీ చాట్, పాలక్ చాట్, కుల్ఫీ ఫలూదా కూడా రుచి చూశారామె. తను తిన్న షాపు వ్యక్తినే పెళ్లిలో కూడా ఈ వెరైటీలన్నీ ఏర్పాటు చేయడానికి ఆహ్వానించారు. కాబట్టి అన్ని వంటల్లో కాశీ స్ట్రీట్ ఫుడ్ ప్రత్యేకంగా నిలవనుంది.

ఈ చాట్ వంటకాలతో పాటే ఉండనున్న మరిన్ని స్ట్రీట్ ఫుడ్స్:

పానీ పూరీ,

దహీ బల్లా,

ప్లెయిన్ సోహాల్,

బల్లా పాప్డి,

మిక్స్ చాట్,

దహీ పూరీ,

చూరా మటర్,

పాప్డి చాట్, సమోసా, గులాబ్ జామూన్, టిక్కి, చనా కచోరీ కూడా ఉండనున్నాయి. దీంతో పాటే ఇండూర్ గరాడు చాట్ కూడా ఉండనుంది. కారం, పుల్లటి రుచితో ఉండే ఈ స్నాక్ ప్రత్యేకంగా నిలవనుంది.

వందకు పైగా కొబ్బరి రుచులు:

ఇండోనేషియాలోని ఒక క్యాటరింగ్ కంపెనీకి అంతర్జాతీయ అతిథులకు భోజనం అందించే బాధ్యతలు ఇచ్చారు ముఖేష్ అంబానీ. దీంట్లో వందకు పైగా కొబ్బరితో చేసిన వంటకాలు ఉంటాయట. కొబ్బరి రుచితో చేసిన మిఠాయిలు, కారం రుచులు ఉండనున్నాయి.

మద్రాస్ ఫిల్టర్ కాఫీ:

ఈ విందులో మద్రాస్ ఫిల్టర్ కాఫీ కూడా ఉండనుంది. మద్రాస్ కాపీ, కుంభకోణం డిగ్రీ కాఫీ, మైలపోర్ ఫిల్టర్ కాఫీ అని రకరకాలుగా పిలుస్తారు దీన్ని. వాసనతోనే మత్తెక్కించే ఈ కాఫీ రుచి ప్రముఖలు, అతిథులు ఆస్వాదించనున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉండే వంటకాలన్నీ ఉండేలా 2500 పైగా వంటకాలున్న మెన్యూను రూపొందించారు ఈ పెళ్లికి. ఎప్పటికీ మర్చిపోలేని వేడుకలా ఈ పెళ్లి నిలిచిపోవాలని అంబానీలు దృడ సంకల్పం తీసుకున్నట్లే ఉంది మరీ.

WhatsApp channel

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024