Indian 2 – Game Changer: భారతీయుడు 2 సినిమాకు రెస్పాన్స్‌తో రామ్‍చరణ్ అభిమానుల్లో టెన్షన్.. ఆ విషయంలో మాత్రం ఊరట అంటూ..

Best Web Hosting Provider In India 2024

ఉలగనాయగన్, తమిళ సీనియర్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషించిన ఇండియన్ 2 (తెలుగులో భారతీయుడు 2) సినిమా నేడు (జూలై 12) థియేటర్లలో రిలీజ్ అయింది. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ అంచనాలతో వచ్చింది. 28 ఏళ్ల కిందట వచ్చి సూపర్ హిట్ అయిన భారతీయుడుకు సీక్వెల్‍గా ఈ మూవీ వచ్చింది. అయితే, భారతీయుడు 2 చిత్రానికి ఎక్కువ శాతం నెగెటివ్ టాక్ వస్తోంది.

టెన్షన్‍లో రామ్‍చరణ్ ఫ్యాన్స్

భారతీయుడు 2 చిత్రానికి నేడు మొదటి షో నుంచే ఎక్కువగా నెగెటివ్ స్పందన వస్తోంది. రివ్యూలు కూడా ప్రతికూలంగానే ఉన్నాయి. ముఖ్యంగా శంకర్ కథ, ఈ మూవీని తెరకెక్కించిన విధానం ఔట్‍డేటెడ్‍గా ఉందంటూ కొందరు అభిప్రాయపడ్డారు. దీంతో మెగా పవన్ స్టార్ రామ్‍చరణ్ అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. శంకర్ దర్శత్వంలో రామ్‍చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ రిలీజ్ కావాల్సింది ఉంది.

భారతీయుడు 2 చిత్రానికి నెగెటివ్ టాక్ రావటంతో గేమ్ ఛేంజర్ సినిమా ఎలా ఉంటుందోనని రామ్‍చరణ్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. పాన్ ఇండియా రేంజ్‍లో హైప్ తక్కువగా ఉంటుందేమోనని కొందరు అభిప్రాయపడుతున్నారు. గేమ్ ఛేంజర్ టేకింగ్‍పై కాస్త టెన్షన్ నెలకొందని అంటున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో చాలా పోస్టులు వస్తున్నాయి. దీనిపై మీమ్స్ కూడా వస్తున్నాయి.

‘ఈ విషయంలో ఊరట’

గేమ్ ఛేంజర్ సినిమాకు కథ శంకర్‌ది కాదని కొందరు రామ్‍చరణ్ ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు స్టోరీ ఇచ్చారని, కథ కచ్చితంగా అదిరిపోతుందని అంటున్నారు. ఈ మూవీని మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామని శంకర్ ఇటీవలే చెప్పారని, కచ్చితంగా ఆకట్టుకుంటుందని భరోసా వ్యక్తం చేస్తున్నారు. చాలా ఏళ్లుగా సరైన హిట్ లేని శంకర్‌కు.. రామ్‍చరణ్ మంచి కమ్‍బ్యాక్ ఇస్తారని కొందరు ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు. మొత్తంగా భారతీయుడు 2 సినిమా వ్యవహారంతో గేమ్ ఛేంజర్ మళ్లీ ట్రెండింగ్‍లోకి వచ్చేసింది.

గేమ్ ఛేంజర్ సినిమాను పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు శంకర్. రెండేళ్లకు పైగా షూటింగ్ సాగుతున్నా ఇంతవరకు రిలీజ్ డేట్ మాత్రం ఖరారు కాలేదు. ఈ ఏడాదే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు నిర్మాత దిల్‍రాజు చెప్పారు. అయితే, షూటింగ్ పూర్తయి.. ఎడిటింగ్ ఫినిష్ అయ్యాకే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని ఇటీవలే డైెరెక్టర్ శంకర్ తెలిపారు. దీంతో రిలీజ్‍పై మళ్లీ సందిగ్ధత నెలకొంది.

గేమ్ ఛేంజర్ సినిమా కోసం తన షూటింగ్ పార్ట్‌ను రామ్‍చరణ్ పూర్తి చేసుకున్నారు. సుమారు ఇంకో 10 రోజుల చిత్రీకరణ చేస్తే మొత్తం ఫినిష్ అవుతుందని శంకర్ తెలిపారు. దీంతో మళ్లీ అప్‍డేట్ ఎప్పుడు వస్తుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గేమ్ ఛేంజర్ చిత్రంలో రామ్‍చరణ్‍కు జోడీగా కియారా అద్వానీ హీరోయిన్‍గా నటిస్తున్నారు. అంజలి, ఎస్‍జే సూర్య, శ్రీకాంత్, జయరాం, సునీల్, సముద్రఖని, ప్రకాశ్ రాజ్, నాజర్ కీరోల్స్ చేస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి ‘జరగండి’ అనే ఓ పాట మాత్రమే వచ్చింది.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024