Best Web Hosting Provider In India 2024

వైఎస్ విగ్రహాలపై దాడులు చేయటాన్ని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా ఖండించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన…..తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వ్యవహరిస్తున్న తీరపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అని స్పష్టం చేశారు.
వైసీపీకి రాజశేఖర్ రెడ్డికి సంబంధం లేదని షర్మిల వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ నీతి, నిజాయితీ, నిబద్ధత ఉన్న కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తే ఊరుకునే ప్రసక్తిలేదని వార్నింగ్ ఇచ్చారు.టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఇదే తన హెచ్చరిక అన్నారు.
మరోమారు ఇలాంటి సంఘటనలు జరిగితే అక్కడే భైఠాయించి ధర్నా చేస్తానని షర్మిల చెప్పారు. ఇలాంటి హత్య, కక్ష, గుండా రాజకీయాలు వైసీపీ చేసిందనే ప్రజలు ఘోరంగా వైసీపీని ఓడించారని గుర్తు చేశారు. మళ్లీ అదే పరిస్థితి రాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు చూసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.
టాపిక్