Suspense Thriller OTT: ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ – ఊహ‌ల‌కు అంద‌ని ట్విస్ట్‌ల‌తో మైండ్‌బ్లాక్

Best Web Hosting Provider In India 2024

Suspense Thriller OTT: తెలుగు స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ ప్రేమ‌లో ఓటీటీలోకి వ‌చ్చింది. ఈ చిన్న సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.థియేట‌ర్ల‌లో రిలీజైన ఆరు నెల‌ల త‌ర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వ‌చ్చింది.

సైలెంట్‌గా శుక్ర‌వారం అమెజాన్‌లో ఈ మూవీ విడుద‌లైంది. చందూ కోడూరి హీరోగా న‌టిస్తూ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. హీరోగా, ద‌ర్శ‌కుడిగా అత‌డికి ఇదే మొద‌టి సినిమా. చ‌రిష్మా శ్రీక‌ర్ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో శివాజీరాజా, మ‌ధుసూద‌న్‌రావు కీల‌క పాత్ర‌లు పోషించారు.

జ‌న‌వ‌రి 26న రిలీజ్‌…

ఇండిపెండెన్స్ డే కానుక‌గా జ‌న‌వ‌రి 26న ప్రేమ‌లో మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. ప్రేమ‌క‌థ‌కు స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ అంశాల‌ను జోడించి ద‌ర్శ‌కుడు చందు ఈ మూవీని తెర‌కెక్కించాడు. కంప్లీట్‌గా ఈ సినిమాను గోదావ‌రి యాస‌లో న‌డిపించాడు డైరెక్ట‌ర్‌. బ్యాక్‌డ్రాప్ కొత్త‌గా ఉన్నా ల‌వ్ స్టోరీ రొటీన్‌గా ఉండ‌టంతో ప్రేమ‌లో మూవీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది.

ప్రేమ‌లో క‌థేమిటంటే?

ర‌వి (చందు కోడూరి) త‌న చిన్న‌త‌నంలోనే త‌ల్లికి దూర‌మ‌వుతాడు. తాగుడుకు బానిస‌గా మారిన తండ్రి (శివాజీరాజా) ర‌విని ప‌ట్టించుకోడు. అయినా చెడుఅల‌వాట్ల జోలికి వెళ్ల‌కుండా ఊళ్లో మంచి పేరు తెచ్చుకుంటాడు ర‌వి. మెడిక‌ల్ షాప్ పెట్టాల‌న్న‌ది అత‌డి డ్రీమ్‌. అనుకోకుండా అత‌డి జీవితంలోకి ప్ర‌శాంతి (చ‌రిష్మా శ్రీక‌ర్‌) వ‌స్తుంది. ప్ర‌శాంతి మూగ అమ్మాయి.

ఆమె మంచిత‌నం చూసి ర‌విప్రేమ‌లో ప‌డ‌తాడు. ప్ర‌శాంతి కూడా ర‌విని ఇష్ట‌ప‌డుతుంది. ప్ర‌శాంతితో ర‌వి అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన ఓ వీడియో బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఆ వీడియో కార‌ణంగా ప్ర‌శాంతి ఆత్మ‌హ‌త్య ప్ర‌య‌త్నం చేస్తుంది. ప్రాణంగా ప్రేమించిన ప్ర‌శాంతితో ర‌వి అలా ప్ర‌వ‌ర్తించ‌డానికి కార‌ణం ఏమిటి? ఆ వీడియో వెన‌కున్న నిజానిజాల‌ను ర‌వి ఎలా బ‌య‌ట‌పెట్టాడు? త‌న నిర్దోషిత్వాన్ని ఏ విధంగా నిరూపించుకున్నాడ‌న్న‌దే ప్రేమ‌లో మూవీ క‌థ‌.

వాస్త‌వ ఘ‌ట‌నల స్ఫూర్తితో…

య‌థార్థ ఘ‌ట‌న‌ల నుంచి స్ఫూర్తి పొందుతూ ద‌ర్శ‌కుడు చందు ఈ మూవీ క‌థ రాసుకున్నాడు. సోష‌ల్ మీడియా లో వ‌చ్చే ఫేక్ వీడియోల కార‌ణంగా కొంద‌రు అమాయ‌కులు ఎన్ని ఇబ్బందులు ప‌డుతున్నార‌నే పాయింట్‌తో ప్రేమ‌లో మూవీని తెర‌కెక్కించాడు. ప్రేమ‌లో సినిమాకు సందీప్ కానుగుల మ్యూజిక్ అందించాడు. రాంపీ నందిగాం సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాడు.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024