Best Web Hosting Provider In India 2024

Indian 2 Day 1 Collections: కమల్‌హాసన్ ఇండియన్ 2 తొలిరోజు బాక్సాఫీస్ వద్ద డిసపాయింట్ చేసింది. రీసెంట్‌గా రిలీజైన కమల్‌హాసన్ సినిమాల్లో అతి తక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. 1996లో రిలీజైన ఇండియన్ మూవీకి సీక్వెల్‌గా యాక్షన్ కథాంశంతో డైరెక్టర్ శంకర్ ఈ మూవీని తెరకెక్కించాడు.
కమల్‌హాసన్, శంకర్ కాంబోకు ఉన్న క్రేజ్ కారణంగా తెలుగు, తమిళంతో పాటు హిందీ భాషల్లో ఈ సినిమాపై భారీగా హైప్ ఏర్పడింది. ఇండియన్ 2 బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఆ అంచనాలకు పూర్తిగా తలక్రిందులు చేస్తూ తొలిరోజే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలా పడింది.
ఫస్ట్ డే కలెక్షన్స్…
ఇండియన్ 2 మూవీ తొలిరోజు 26 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. తమిళంలో శుక్రవారం రోజు ఈ సినిమాకు 17 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు వెర్షన్ భారతీయుడు 2 మొదటి రోజుదాదాపు ఎనిమిది కోట్ల వరకు కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.
హిందీ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడంలో ఈ మూవీ పూర్తిగా విఫలమైంది. తొలిరోజు ఇండియన్ 2 హిందీవెర్షన్ హిందుస్థానీ 2 కేవలం కోటి పది లక్షల కలెక్షన్స్ మాత్రమే దక్కించుకున్నట్లు తెలిసింది.
విక్రమ్ ఫస్ట్ డే అరవై కోట్లు…
కమల్‌హాసన్ బ్లాక్‌బస్టర్ మూవీ విక్రమ్ మొదటిరోజు 60 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. కమల్‌హసన్ విలన్‌గా నటించిన కల్కి 2898 ఏడీ మూవీ ఫస్ట్ డే ఏకంగా 190 కోట్ల వసూళ్లను దక్కించుకుంది.
ఆ సినిమాలకు దరిదాపుల్లో కూడా ఇండియన్ 2 నిలవకపోవడం గమనార్హం. అంతే కాకుండా శంకర్ లాస్ట్ మూవీ రోబో 2.ఓ తొలిరోజు వరల్డ్ వైడ్‌గా 93 మూడు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీలో సగం వసూళ్లను కూడా ఇండియన్ 2కు రాబట్టలేకపోవడంలో బాక్సాఫీస్ వర్గాలను విస్మయపరుస్తోంది.
ఓవర్‌సీస్ ప్రీమియర్స్ నుంచే…
ఓవర్‌సీస్ ప్రీమియర్స్ నుంచే ఇండియన్ 2 మూవీకి నెగెటివ్ టాక్ రావడంతో ఫస్ట్ డే కలెక్షన్స్‌పై ఎఫెక్ట్ బాగా పడినట్లు చెబుతోన్నారు. శనివారం రోజు వసూళ్లు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలుగు వెర్షన్ భారతీయుడు 2 తొలిరోజు దాదాపు పదిహేను కోట్లకుపైనే వసూళ్లను రాబడుతుందని అనుకున్నారు. కానీ అందులో సగం వసూళ్లను కూడా దక్కించుకోలేకపోయింది. మాత్ టాక్‌తో పాటు నైజాంలో భారతీయుడు 2కు టికెట్ల రేట్లు పెంచడం వల్లే కలెక్షన్స్ తగ్గినట్లు వార్తలు వినిపిస్తోన్నాయి
సేనాపతిగా కమల్….
ఈ మూవీలో సేనాపతి పాత్రలో కమల్ యాక్టింగ్ బాగుందనే కామెంట్స్ వినిపిస్తోన్నాయి. విజువల్‌గా గ్రాండియర్‌గా ఉన్నా ఔట్‌డేటెడ్ స్టోరీ, ప్రెడిక్టబుల్ స్క్రీన్‌ప్లే కారణంగా సినిమా బోర్ కొట్టించిందని అభిమానులు విమర్శలు గుప్పిస్తోన్నారు. శంకర్ మార్కు ఎమోషన్స్ ఈ సినిమాలో అసలే కనిపించలేదని అంటున్నారు.
సేనాపతి ఎంట్రీ…
ఇండియన్ 2లో కమల్‌హాసన్‌తో పాటు సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ కీలకపాత్రల్లో నటించారు. దేశంలో అవినీతి బాగా పెరిగిపోవడంతో సేనాపతి (కమల్‌హాసన్) మళ్లీ ఎంట్రీ ఇస్తాడు. అవినీతి పరులను అంతమొందిస్తుంటాడు. సేనాపతి తిరిగి రావడానికి యూట్యూబర్ అరవింద్‌కు (సిద్ధార్థ్) ఉన్న సంబంధం ఏమిటి?
సేనాపతిని ఇండియాకు రావాలని కోరుకున్న యువతే అతడిని దేశం వదిలి ఎందుకు వెళ్లిపొమ్మన్నారన్నదే యాక్షన్ అంశాలతో దర్శకుడు శంకర్ ఇండియన్ 2 మూవీలో చూపించాడు. ఇండియన్ 2 మూవీకి కొనసాగింపుగా ఇండియన్ 3 రాబోతోంది. ఇండియన్ 2 క్లైమాక్స్‌లో ఇండియన్ 3 టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో కమల్‌హాసన్‌తో పాటు కాజల్ అగర్వాల్ కనిపించింది.