Best Web Hosting Provider In India 2024
Captain America Teaser Released: సూపర్ హీరోస్‌ను ఇష్టపడేవారికి మార్వెల్ స్టూడియోస్ గురించి పరిచయం అవసరం లేదు. అందులోనూ కెప్టెన్ అమెరికా గురించి హింట్ కూడా అక్కర్లేదు. సూపర్ హీరోలను ఇష్టపడేవారిలో కెప్టెన్ అమెరికా ముందు వరుసలో ఉంటాడు. మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చిన ఈ పాత్రకు బీభత్సంగా ఫ్యాన్స్ ఉన్నారు.
సినిమాల్లో అంతగా కెప్టెన్ అమెరికా పాత్ర అంతగా ఎక్కేసింది. అందుకు కారణం ఆ పాత్రలో స్టీవ్ రోజర్స్గా చేసిన యాక్టర్ క్రిస్ ఇవాన్స్. కెప్టెన్ అమెరికాగా క్రిస్ ఇవాన్స్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఆయన హీరోగా కెప్టెన్ అమెరికా ఫ్రాంఛైజీలో మూడు సినిమాలు, నాలుగు అవెంజర్స్ సినిమాలు వచ్చాయి. అయితే అవెంజర్స్ ఎండ్ గేమ్‌లో కెప్టెన్ అమెరికా స్టీవ్ రోజర్స్ ఓల్డ్ అయిపోయినట్లు చూపించారు.
ఆ తర్వాత నుంచి కెప్టెన్ అమెరికాగా ఎవరు వస్తారనే ఆసక్తి నెలకొంది. అయితే అందరు అనుకున్నట్లుగానే ఈ మార్వెల్ కామిక్స్‌లో ఫాల్కన్ అండ్ సామ్ విల్సన్ పాత్రలో చేసిన ఆంథోనీ మాకీనే కొత్త కెప్టెన్ అమెరికా అవతారం ఎత్తాడు. ఇదివరకు ఆంథోనీ మాకీ ఫాల్కన్ అండ్ ది వింటర్ సోల్జర్ వెబ్ సిరీస్‌లో మెయిన్ లీడ్ రోల్ చేశాడు. ఇప్పుడు అతనే కెప్టెన్ అమెరికా సినిమా రానుంది.
ఆంథోనీ మాకీ సూపర్ హీరోగా చేస్తున్న మార్వెల్ సంస్థ మూవీ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్. తాజాగా కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. యాక్షన్ కట్స్‌తో టీజర్ అదిరిపోయింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్‌గా ఉంది. ఇందులో యూఎస్ అధ్యక్షుడు థ్యాడ్యూస్ థండర్ బోల్ట్‌గా ఇండియానా జోన్స్ ఫేమ్ హారిసన్ ఫోర్డ్ నటించారు. హారిసన్, ఆంథోనీ మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి.
నువ్ కెప్టెన్ అమెరికావి.. స్టీవ్ రోజర్స్వి కాదు అని యూఎస్ అధ్యక్షుడు అంటే.. అవును.. కాదు అని సామ్ విల్సన్ (ఆంథోనీ మాకీ) అనడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది స్టీవ్ రోజర్స్‌ను తప్పా ఇంకెవరిని కెప్టెన్ అమెరికా ఊహించుకోలేం అనే విషయాన్ని గుర్తు చేసేలా ఉంది. ఇక చివరిగా రెడ్ హల్క్ ఎంట్రీ కేక పెట్టించింది. కెప్టెన్ అమెరికా షీల్డ్‌ని నేలకు కొట్టి ఇచ్చిన రెడ్ హల్క్ ఎంట్రీ అదిరిపోయింది.
అయితే ఈ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ సినిమాలో విలన్‌గా రెడ్ హల్క్ కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఈ రెడ్ హల్క్‌గా అమెరికా అధ్యక్షుడు థ్యాడ్యూస్ థండర్ బోల్ట్ రోస్‌గా చేసిన హారిసన్ ఫోర్డ్ కనిపించనున్నాడు. ఎందుకంటే మార్వెల్ కామిక్‌లో యూఎస్ ప్రెసిడెంట్ థ్యాడ్యూసే రెడ్ హల్క్ అని థీరి ఉంది.
ఇది కానీ నిజమైతే ఈ సర్ప్రైజ్కు మించిన విషయం ఉండదు. అయితే, ఇన్నాళ్లు ఈ రెడ్ హల్క్ పాత్రపై మార్వెల్ ఎలాంటి హింట్ కానీ, క్లూ కానీ ఇవ్వలేదు. కానీ, ఇలా సడెన్‌గా రెడ్ హల్క్‌ను చూపించి మార్వెల్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీ 2025 ఫిబ్రవరి 14న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.
ఇక హాలీవుడ్లో బ్లాక్ బస్టర్ అడ్వెంచర్ ఫ్రాంఛైజీ అయిన ఇండియానా జోన్స్ హీరో హారిసన్ ఫోర్డ్ విలన్‌గా చేయడం మరో సర్ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. ఈ ఇండియానా జోన్స్ స్ఫూర్తితోనే ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబీ29 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.