
Best Web Hosting Provider In India 2024

అంబానీలంటే నిలువెత్తు బంగారు వస్త్రాలు ధరించి, వజ్రాల నగలతో మెరిసిపోయే వాళ్లలాగే గుర్తొస్తారు. అనంత్ అంబానీ పెళ్లి వేడుకలతో మన మనసుల్లో వాళ్ల ఫోటోలు అలా ఫిక్స్ అయిపోయామంతే. కానీ అంబానీలను ఒక మధ్య తరగతి కుటుంబంలో ఉన్నట్లు ఊహించుకుని, వాళ్లింట్లో పెళ్లి జరిగితే ఎలా ఉంటుందో ఏఐ ద్వారా కొన్ని ఫొటోలు సృష్టించారు సాహిద్ అనే క్రియేటర్. ఒక్కో ఫోటో దేనికదే ప్రత్యేకంగా ఉంది. ఈ ఫోటోలు ఒకరిని హాస్యాస్పదం చేసినట్లు కాకుండా, ఆ క్రియేటర్ ఊహను మెచ్చుకునేలా ఉన్నాయి.
ఈ ఫోటోల్లో రాధిక ఒక వెయ్యి రూపాయలు కూడా ఖరీదు చేయని చీరలో ఉన్నారు. ఇషా అంబానీ మధ్యతరగతి ఆడపడుచులాగా సింపుల్ బాందినీ కుర్తాలో ఉన్నారు. ఇషా అంబానీ పసుపు రంగు చీర కట్టుకున్న రాధికను తీసుకువస్తున్నట్లున్న ఫొటో అయితే మరీ మధ్య తరగతిని గుర్తు చేస్తోంది. ఒక ఫొటోలో ముఖేష్ అంబానీ దిండ్లు పట్టుకుని ఉన్నట్లు, మరో ఫొటోలో మధ్య తరగతి భరాత్ ఫోటోలో నీతా అంబానీ డ్యాన్స్ చేస్తున్నట్లు ఉంది.
ఊహాజనిత ఫొటోలు:
అంబానీలు ఒక మధ్య తరగతి కుటుంబం అయ్యి, వాళ్లింట్లో రాధిక, అనంత్ ల పెళ్లి జరిగితే ఎలా ఉంటుంది? అని ఈ ఫొటోలకు క్రియేటర్ క్యాప్షన్ పెట్టారు. 2006 లో వచ్చిన బాలీవుడ్ వివాహ్ సినిమాను స్ఫూర్తిగా తీసుకుని ఈ ఫొటోలు రూపొందించారట. దీనికి సంబంధించిన ఫోటోలు చూడండి.
ఈ ఫొటోలకు నెటిజన్లు తెగ కనెక్ట్ అయిపోయారు. చాలా వినోదాత్మకంగా కామెంట్లు పెట్టారు. అంబానీలు మధ్య తరగతిగా ఉన్నా కూడా నాకన్నా రిచ్ గా ఉన్నారని ఒకరు కామెంట్ చేశారు. నిజమైన వేడుకల కన్నా ఈ ఫోటోల్లో ప్రేమ ఎక్కువగా కనిపిస్తుందని మరొకరన్నారు. అసలు ఫొటోలు కూడా ఇంతందంగా ఉండవని ఇంకొక నెటిజన్ కామెంట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని ఫోటోలు కింద లింకులో చూడండి.