Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: ఈనాడు అధినేత రామోజీ రావు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. రామోజీ ఆరాటమే తప్ప చంద్రబాబు రాజకీయంగా బతికే పరిస్థితి లేదన్నారు. పాత ఫోటోలతో పట్టాభి కథనాన్ని వండి వార్చారని తప్పుపట్టారు. ప్రభుత్వంపై బురద జల్లడమే రామోజీ లక్ష్యమన్నారు. రామోజీ వైట్ కాలర్ క్రిమినల్, ఆర్థిక నేరాల్లో అగ్రగణ్యుడని విమర్శించారు. చంద్రబాబు మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, అందరూ కలిసొచ్చినా వైయస్‌ఆర్‌సీపీని ఏమీ చేయలేరన్నారు. కన్నా లక్ష్మీ నారాయణ నైతిక విలువలు లేని వ్యక్తి అన్నారు. చంద్రబాబు చేతిలో కన్నా రాజకీయ భవిష్యత్ శూన్యమన్నారు. రేపు సాయంత్రం లోగా రామోజీ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే రామోజీపై పరువు నష్టం దావా వేస్తామని మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. గురువారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.