Tirumala : తిరుమలలో దళారీ వ్యవస్థకు చెక్‌..! టీటీడీ సేవల్లో సమూల మార్పులు, తాజా నిర్ణయాలివే

Best Web Hosting Provider In India 2024

Tirumala Tirupati Devasthanam Updates : శ్రీవారి దర్శనంతో పాటు వసతి సేవల్లో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు టీటీడీ సిద్ధమైంది. దళారుల ప్రమేయం లేకుండా, మరింత పారదర్శకంగా నేరుగా అందించేందుకు చర్యలు తీసుకుంది. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.

 

భక్తులకు ఆఫ్‌లైన్ (కౌంటర్ సేవలు) మరియు ఆన్‌లైన్ (వెబ్ పోర్టల్) రెండింటిలోనూ అందించే సేవలను అనేక మంది మధ్యవర్తులు భక్తులను మోసం చేసి, భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు టీటీడీ గుర్తించింది. గత ఏడాది కాలంగా ఆన్‌లైన్ లో (రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం, డిప్, వసతి, ఆర్జిత సేవాలు, వర్చువల్ సేవలు మొదలైనవి) మరియు ఆఫ్‌లైన్ లో (ఎస్ ఎస్ డి టోకెన్లు, వసతి) తదితర సేవల బుకింగ్‌లపై ఇటీవల టీటీడీ విచారణ జరిపింది. ఇందులో ఓకే మొబైల్ నంబర్, మెయిల్ ఐడీలు ఉపయోగించి మధ్యవర్తులు బల్క్ బుకింగ్ పొందినట్లు విచారణలో తేలింది.

మోసపూరిత బుకింగ్ లపై విచారణ :

ఈ ఏడాది తిరుమలలో కరెంట్ బుకింగ్‌లో ఒకే మొబైల్ నంబర్‌తో 110 గదులు, 124 బుకింగ్స్ సంబంధించి 12కు పైగా గదులు పొందినట్లు అధికారుల విచారణలో నిర్ధారణ అయింది. అదేవిధంగా ఆన్‌లైన్ బుకింగ్‌లో ఒకే మొబైల్ నంబర్‌ను ఉపయోగించి 807 వసతి బుకింగ్‌లు, ఒకే ఇమెయిల్ ఐడిని ఉపయోగించి 926 వసతి బుకింగ్‌లు చేసినట్లు తేలింది.

ఒకే మొబైల్ నంబర్‌ని ఉపయోగించి ఒక సంవత్సరంలో 1,279 డిప్ రిజిస్ట్రేషన్‌లు, ఒకే మెయిల్ ఐడిని ఉపయోగించి ఒక సంవత్సరంలో 48 డిప్ రిజిస్ట్రేషన్‌లు, ఒకే ఐడి ప్రూఫ్‌ని ఉపయోగించి 14 ఎస్ ఎస్ డి సర్వ సర్వదర్శనం టోకెన్‌లు పొందినట్లు టీటీడీ విచారణలో గుర్తించారు.

 

విచారణలో కీలక అంశాలు వెలుగు చూడటంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అందిస్తున్న సేవలలో పారదర్శకతను మరింతగా పెంచేందుకు సిద్ధమైంది. ఈ సేవలను మరింత మెరుగుపరిచి ఆఫ్‌లైన్‌లో మరియు ఆన్‌లైన్‌లో టికెట్లు పొందే దళారులు మరియు మధ్యవర్తులపై చర్యలు చేపట్టింది.

ఇందులో బల్క్ బుకింగ్‌లకు ఉపయోగించే మొబైల్ నంబర్‌లు, మెయిల్‌లు మరియు ఐడి ప్రూఫ్‌లను టీటీడీ రద్దు చేసింది. ఫేక్ మొబైల్ నెంబర్లు, మెయిల్ ఐడిలు, ఐడి ప్రూఫ్ లు ఉపయోగించి ఇప్పటికే బుక్ చేసిన సేవలను ఉపయోగించడానికి అనుమతించబడవు. బుకింగ్ రద్దు అయినట్లు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు తెలియజేయబడుతుంది.

నిజమైన యాత్రికులు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌ను ఉపయోగించి మధ్యవర్తి లేకుండా సేవను నేరుగా పొందేలా టీటీడీ కార్యాచరణ రూపొందిస్తుంది. దళారులు ఫేక్ మొబైల్, మెయిల్, ఐడి ప్రూఫ్‌లను ఉపయోగించి చేసిన బుకింగ్‌లపై కఠినమైన ఆంక్షలు విధించారు. సరైన ధృవీకరణ కోసం ఆధార్ సేవలను ఉపయోగించేలా కూడా ప్రయత్నాలు చేపడుతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది.

జులై 16న బ్రేక్ దర్శనాలు రద్దు….

తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16న సాలకట్ల ఆణివార ఆస్థానం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో జూలై 16న బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ కారణంగా జూలై 15వ తేదీ సిఫారసు లేఖలు స్వీకరించబడవు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ ఓ ప్రకటనలో కోరింది.

 
WhatsApp channel
 

టాపిక్

 
TtdAndhra Pradesh NewsDevotionalDevotional News
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024