Best Web Hosting Provider In India 2024

నెల్లూరు: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి సర్వేపల్లి నియోజకవర్గంలో విశేష స్పందన లభిస్తోంది. పొదలకూరు మండలం ప్రభగిరిపట్నం సచివాలయ పరిధిలో ఉలవరపల్లి, ప్రభగిరిపట్నం గ్రామాల్లో మంత్రి “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాకాణికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో తాము సంతృప్తిగా ఉన్నామని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు “ఒక్క రూపాయి మంజూరు చేయించలేకపోయిన సోమిరెడ్డి” పనిగొట్టుకొని విమర్శలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాడని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. సోమిరెడ్డి హయాంలో శంకుస్థాపన శిలాఫలకాలు తప్ప, ప్రారంభోత్సవ శిలాఫలకాలు లేవన్నారు. సోమిరెడ్డి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు నిధులు కేటాయించలేక పోయాడన్నారని విమర్శించారు. ప్రభగిరిపట్నం గ్రామంలో నేను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వలన ప్రజల్లో ఇంత పెద్ద ఎత్తున స్పందన రావడానికి కారణమన్నారు. గ్రామాల్లో ప్రతి గడపకు వెళ్లి, ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ, ప్రభుత్వ ద్వారా అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఆరా తీయడంతో పాటు, అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకోవడమే అజెండాగా “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి కాకాణి తెలిపారు.