Best Web Hosting Provider In India 2024

హైదరాబాద్: మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి చనిపోయిన రోజున మార్చురీ దగ్గర ఏం మాట్లాడానో ఇప్పుడు కూడా అదే చెబుతున్నా..అదే వాస్తవమని వైయస్ఆర్‌సీపీ ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. విచారణ జరుగుతుండగానే మీడియానే ట్రయల్ చేసి దోషులు ఎవరో తేల్చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు వార్తలు వేయకుండా నిజాలను నిజాలుగా వేయండి. మీడియా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు. కడప ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. సీబీఐ విచారణలో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చిన అవినాష్‌రెడ్డి.. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. తనకు తెలిసిన వాస్తవాలే సీబీఐకి చెప్పానని పేర్కొన్నారు. సరైన దిశలో విచారణ జరగాలనే తాను చెబుతున్నానని, వాస్తవాన్ని టార్గెట్ చేయకుండా వ్యక్తిని టార్గెట్ చేసి విచారణ జరుగుతోందని వైయస్ అవినాష్‌రెడ్డి వ్యాఖ్యానించారు.