Best Web Hosting Provider In India 2024

మిస్టీరియస్ వెబ్ సిరీస్ గా ప్రేకక్షుల ముందుకు వచ్చింది అగ్నిసాక్షి వెబ్ సిరీస్. గత వారం నాలుగు ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. ఈ శుక్రవారం మరొక నాలుగు ఎపిసోడ్స్ ని ప్రసారమయ్యాయి. ఈ వారం ఏం జరిగింది? మాస్క్ మ్యాన్ నుంచి గౌరీ ఎలా తప్పించుకుంది? కావ్య హత్య వెనుక ఉన్న మాస్క్ మ్యాన్ ను శంకర్ పట్టుకున్నాడో లేదో తెలియాలంటే ఇది చదవాల్సిందే.
ఒకేలా ఆలోచించిన గౌరి, శంకర్
ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేసేందుకు గౌరి మాస్క్ మ్యాన్ ఇంటికి వెళ్తుంది. కానీ అతడిని మాత్రం మనకు చూపించరు. కట్ చేస్తే శంకర్ ని గౌరీ ప్రతిసారి ఇరిటేట్ చేస్తూ వస్తుంది. ఇక హత్యకు గురైన కావ్య కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి శంకర్ వెళతాడు. అదే ఇంటికి గౌరీ కూడా వెళ్తుంది. ఇద్దరూ హత్య జరిగిన తీరు గురించి ఒకే విధంగా ఆలోచిస్తూ కావ్య డెడ్ బాడీని కనిపెడతారు. వాళ్ళను మాస్క్ మ్యాన్ దూరం నుంచి చూస్తూ ఉంటాడు.
మాస్క్ మ్యాన్ ని గమనించిన శంకర్ అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఈ ఆపరేషన్ లో కూడా గౌరీ వేలు పెట్టేసి చెడగొట్టేస్తుంది. మాస్క్ మ్యాన్ ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో గౌరీను లారీ ఢీ కొట్టబోతుంటే శంకర్ కాపాడతాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు పట్టుకోవడం చూసి మాస్క్ మ్యాన్ రగిలిపోతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన వ్యక్తిని కత్తితో పొడిచి వెళ్ళిపోతాడు.
ఆమె చేసిన పని వల్లే
హత్యకు గురైన వ్యక్తిని చూసి గౌరి బాగా భయపడిపోతుంది. శంకర్ ఆమెను ధైర్యంగా ఉండమని చెప్తాడు. ఒకే రోజు రెండు హత్యలు జరగడం వెనుక ఏదో లింకు ఉందని శంకర్ అనుమానిస్తాడు. మధ్య మధ్యలో గౌరి శంకర్ కుటుంబాల గురించి చూపిస్తూ ఉంటారు. గౌరి తన పిన్ని కొడుకు ఆపరేషన్ కోసం రూపాయి రూపాయి కూడబెడుతుంది. అటు శంకర్ నానమ్మ గాయత్రీ దేవి పెడుతున్న ఆంక్షల వల్ల ఊపిరి కూడా ఆడటం లేదని జయంతి బాధపడుతుంది.
ఇంతకుముందు ఈ ఇల్లు చాలా బాగుండేదని కానీ విశ్వ భార్య చేసిన పని నుంచి గాయత్రీ అత్తయ్య ఇలా ఆంక్షలు పెడుతున్నారని జయంతి అత్త తనకు సర్ది చెప్తుంది. ఈ వారం ఎపిసోడ్ లో మరో క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె శాంత.. గాయత్రీ దేవి ఆడపడుచు. సత్య కోసం మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చానని చెప్తుంది. కానీ తన కుటుంబంలో కోడలు చేసిన పని వల్ల కుటుంబానికి మచ్చ పడిందని పెళ్లి అంటేనే భయంగా ఉందని గాయత్రీ దేవి కన్నీళ్ళు పెట్టుకుంటుంది.
శంకర్ కి కిల్లర్ సవాల్
పోలీస్ అవ్వాలంటే ముందు ధైర్యంగా ఉండాలి అని శంకర్ గౌరీకి చెప్తాడు. తననే అవమానిస్తాడా అంటూ రగిలిపోతూ గౌరీ శంకర్ కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో ఇంట్లో అలికిడి కావడంతో శంకర్ లోపలికి వెళ్ళి చూస్తాడు.
అదే సమయంలో కిల్లర్ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. గదిలో అద్దం మీద క్యాచ్ మీ అంటూ కిల్లర్ శంకర్ కి సవాలు విసురుతాడు. అతడి కోసం ఇల్లంతా వెతుకుతాడు. కానీ కనిపించడు. వెళ్తూ వెళ్తూ కిల్లర్ శంకర్ ఇంట్లో గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఐరన్ బాక్స్ స్విచ్ ఆన్ చేసి వెళతాడు. సరిగా సత్య అదే సమయంలో కిచెన్ లోకి శంకర్ తనని ఆపుతాడు. అప్పుడే కిచెన్ పేలిపోతుంది. తన కుటుంబానికి ఎందుకు ఇలా జరుగుతుందని గాయత్రీ దేవి చాలా బాధపడుతుంది.
అటు గౌరీ ఇంట్లో కూడా తన పిన్ని బాబాయ్ గొడవ పడుతూ ఉంటారు. పిన్నిని కొడితే చంపేస్తానని గౌరీ అనడంతో తన బాబాయ్ ఆమెను ఇంట్లో నుంచి గెంటేస్తాడు. ఇక తన పనిలో భాగంగా గౌరి ఒక రెస్టారెంట్ కి ఆర్డర్ తీసుకోవడానికి వెళ్తుంది. అక్కడికి శంకర్ తన చెల్లి సత్య, జయంతిని తీసుకుని వస్తాడు. అక్కడ ఒక బాబు లెటర్ తీసుకొచ్చి గౌరీకి ఇస్తాడు. ఎవరు ఇవ్వమన్నారు అంటే ఆ అంకుల్ అని శంకర్ ని చూపించి వెళ్ళిపోతాడు.
తరువాయి భాగంలో…
శంకర్ తనని ప్రేమిస్తున్నాడని గౌరి ఊహించుకుంటుంది. అతని కోసం గాయత్రీ దేవి ఇంటికి వెళుతుంది. ఆ తర్వాత గౌరి మీద కిల్లర్ హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నిస్తాడు. అసలు కిల్లర్ గౌరీ శంకర్లను ఎందుకు టార్గెట్ చేశాడు? శంకర్ కిల్లర్ విసిరిన సవాల్ చేధించగలుగుతాడా? ఈ హత్యలు చేయడం వెనుక ఉన్న కారణం ఏంటి? అనేది తెలియాలంటే మరిన్ని ఎపిసోడ్స్ చూడాల్సిందే.
Best Web Hosting Provider In India 2024
Source / Credits