Pawan Kothuri: హీరోగా మారిన డైరెక్టర్ పవన్ కొత్తూరి.. రొమాంటిక్‌గా సారా సారా సాంగ్ రిలీజ్

Best Web Hosting Provider In India 2024

Pawan Kothuri Average Student Nani: టాలీవుడ్‌లో ట్రెండ్ మారింది. ఆడియెన్స్ టేస్ట్‌కు తగ్గట్టుగా సినిమాలు వస్తున్నాయి. పెద్ద హీరోల చిత్రాలను సైతం ప్రేక్షకులు తిరస్కరిస్తున్నారు. కంటెంట్ ఉంటే చిన్న చిత్రాలను నెత్తిన పెట్టుకుంటున్నారు. అందుకే టాలీవుడ్ మేకర్లు కొత్త కథలు, కాన్సెప్టుల మీద ఫోకస్ పెడుతున్నారు.

ఈ క్రమంలోనే దర్శకులు హీరోలుగా.. హీరోలు దర్శకరచయితలుగా మారుతున్నారు. మెరిసే మెరిసే చిత్రంతో పవన్ కుమార్ కొత్తూరి దర్శకుడిగా విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఈ దర్శకుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ అనే చిత్రంతో హీరోగా డైరెక్టర్ పవన్ కొత్తూరి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

కేవలం హీరోగానే మాత్రమే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగానూ యావరేజ్ స్టూడెంట్ నాని సినిమాకు పవన్ కుమార్ బాధ్యతులు చేపట్టారు. ఈ యావరేజ్ స్టూడెంట్ నాని సినిమాను శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కొత్తూరినే నిర్మించారు.

కాగా ఇప్పటికే యావరేజ్ స్టూడెంట్ నాని చిత్రం నుంచి వచ్చిన కాన్సెప్ట్ పోస్టర్, మోషన్ పోస్టర్.. ఫస్ట్ లుక్ పోస్టర్ ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ కూల్ అప్డేట్‌ను ఇచ్చారు. బయట ఉన్న కూల్ వెదర్‌కు తగ్గట్టుగా, మనసుకు హత్తుకునేలా, హాయినిచ్చేలా సాగే ఓ మెలోడీ పాటను వదిలారు.

మెలోడీ అండ్ రొమాంటిక్‌గా సారా సారా అంటూ సాగే పాటను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఈ సారా సారా అని సాగే పాటను శివకృష్ణచారి ఎర్రోజు రచించగా.. పద్మలత, అనుదీప్ దేవ్ ఆలపించారు. కార్తీక్ బి కొడకండ్ల ఇచ్చిన బాణీ ఎంతో వినసొంపుగా ఉంది. అంటే, ఈ సినిమాకు కార్తీక్ బి కొడకండ్ల సంగీతం అందిస్తున్నారు.

షూటింగ్ పూర్తి చేసుకున్న యావరేజ్ స్టూడెంట్ నాని సినిమా త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో స్నేహా మాలవ్య, సాహిబా భాసిన్‌, వివియా సంత్‌లు హీరోయిన్లుగా నటించారు అలాగే ఈ చిత్రానికి సజీష్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫీని నిర్వహించగా, ఉద్ధవ్ ఎస్ బి ఈ చిత్రానికి ఎడిటర్‌గా పని చేశారు.

ఇదిలా ఉంటే, పవన్ కుమార్ కొత్తూరి, స్నేహ మాలవ్య, సాహిబా భాసిన్‌తోపాటు వివియా సంత్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, ఖలేజా గిరి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా పవన్ కొత్తూరి దర్శకుడిగా పరిచయమైన సినిమా మెరిసే మెరిసే. ఈ మూవీ రొమాటింక్ డ్రామాగా 2021లో విడుదలై పర్వాలేదనిపించుకుంది.

ఐఎమ్‌డీబీలో 6.3 రేటింగ్ తెచ్చుకున్న మెరిసే మెరిసే సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో దినేష్ తేజ్, శ్వేత అవస్తి హీరో హీరోయిన్‌గా నటించారు.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024