Best Web Hosting Provider In India 2024
మలయాళ హీరోయిన్ మమితా బైజూ.. ప్రేమలు సినిమాతో చాలా పాపులర్ అయ్యారు. ఈ మూవీతో నేషనల్ రేంజ్లో క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే, మలయాళంలో అంతకు ముందే మమితా కొన్ని సినిమాలు చేశారు. 2017లోనే అరంగేట్రం చేసిన ఈ భామ మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు. రజిషా విజయన్, మమితా బైజూ ప్రధాన పాత్రలు పోషించిన ఖోఖో సినిమా 2021లో రిలీజ్ అయింది. ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీ ప్రశంసలు దక్కించుకుంది. మూడేళ్ల తర్వాత ఖోఖో చిత్రం తెలుగులో డబ్బింగ్ అయి.. నేడు (జూలై 25) స్ట్రీమింగ్కు వచ్చింది.
స్ట్రీమింగ్ వివరాలు
ఖోఖో సినిమా తెలుగు వెర్షన్ ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో నేడు స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆ ప్లాట్‌ఫామ్ వెల్లడించింది. “స్కూల్ రోజులను, ఖోఖో గేమ్స్, టీమ్‌మేట్స్‌ను గుర్తు చేసుకోండి. అద్భుతమైన ఖోఖో స్టోరీలైన్‌తో అప్పటి రోజుల్లోకి వెళ్లండి. ఈటీవీ విన్లో ఖోఖో స్ట్రీమింగ్ అవుతోంది” అని ఈటీవీ విన్ ఓటీటీ ట్వీట్ చేసింది.
ఖోఖో చిత్రానికి రాహుల్ రిజి నాయర్ దర్శకత్వం వహించారు. స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మోస్తరు కలెక్షన్లను దక్కించుకుంది. ఈ చిత్రంలో రజిషా విజయన్, మమితా బైజూతో పాటు వెంకటేశ్ వీపీ, రంజిత్ శేఖర్, వెట్టుకిలి, రాహుల్ రిజి నాయర్, అరుణ్ రంజన్, శ్రీజిత్ బాబు కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీలో ఖోఖో ప్లేయర్లుగా నటించిన వారు నిజజీవితంలోనూ ఖోఖో ప్లేయర్లే.
ఖోఖో మూవీని ఫస్ట్ ప్రింట్ స్టూడియోస్ బ్యానర్ నిర్మించగా.. సిద్ధార్థ్ ప్రతాప్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి గాను బెస్ట్ సపోర్టింగ్ నటిగా కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డును మమితా బైజూ అందుకున్నారు. దర్శకుడు రాహుల్ రిజికి ప్రత్యేక జూరీ అవార్డు దక్కింది.
ఖోఖో స్టోరీలైన్
స్కూల్లో ఖోఖో జట్టును పీటీ టీచర్ సిద్ధం చేయడం చుట్టూ ఖోఖో సినిమా స్టోరీ సాగుతుంది. మరియా ఫ్రాన్సిస్ (రజిషా విజయన్) మంచి ప్లేయర్ అయినా కుటుంబ పరిస్థితుల కారణంగా పాఠశాలలో పీటీ టీచర్‌గా చేరతారు. జీవితంలో తాను సాధించలేనిది విద్యార్థినులతో సాకారం చేసుకోవాలని అనుకుంటారు. దీంతో ఆ పాఠశాలలో అమ్మాయిలతో ఓ ఖోఖో టీమ్ తయారు చేస్తారు. వారికి శిక్షణ ఇస్తారు. వారి వ్యక్తిగత జీవితాలు కూడా ఈ మూవీలో ఉంటాయి. ఈ ఖోఖో టీమ్‌కు అంజు (మమితా బైజూ) కెప్టెన్‌గా ఉంటుంది. ఈ టీమ్‌ను మరియా విజయవంతంగా ముందుకు నడిపారు? ఆమె ఆశలను ఆ ప్లేయర్లు, జట్టు నెరవేర్చిందా? ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనేదే ఖోఖో మూవీలో ప్రధాన అంశాలుగా ఉంటాయి.
కాగా, ఆహా ఓటీటీలో సుధీర్ బాబు హీరోగా నటించిన హరోం హర చిత్రం గత వారమే స్ట్రీమింగ్కు వచ్చింది. జ్ఞానసాగర్ ద్వారక ఈ మూవీకి దర్శకత్వం వహించారు. థియేటర్లలో రిలీజైన నెలకే ఈ చిత్రం ఈటీవీ విన్‌తో పాటు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి వ్యూస్ దక్కించుకుంటోంది.