Simbaa: ఎయిర్ పొల్యూషన్‌తో 65 శాతం మరణాలు.. అదిరిపోయిన సూపర్ నాచురల్ థ్రిల్లర్

Best Web Hosting Provider In India 2024

Simbaa Movie About Air Pollution: బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ భరద్వాజ నటించిన మరో కొత్త సినిమానే సింబా. ఇందులో సీనియర్ హీరో, నటుడు జగపతి బాబు సైతం కీలక పాత్ర పోషించారు. అలాగే బిగ్ బాస్ దివి వాద్యా కూడా ఓ కీ రోల్ ప్లే చేసింది. ఈ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సినిమాకు మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు.

సింబా మూవీని సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద సంపత్ నంది, దాసరి రాజేందర రెడ్డి నిర్మించారు. డైరెక్టర్ సంపత్ నంది కథ అందించిన సింబా మూవీ ట్రైలర్‌ను బుధవారం (జూలై 24) విడుదల చేశారు. పర్యావరణ కాలుష్యం, దాని వల్ల జరిగే అనర్థాలను ఒక సూపర్ నాచురల్ థ్రిల్లర్ జోనర్‌లో సినిమా ద్వారా చెప్పారు.

“హంతకులందరికి వార్మ్ డెత్.. ప్రపంచంలో ఎయిర్ పొల్యూషన్ వల్ల 65 శాతం మంది చనిపోతున్నారు.. అంటే దమ్ము, మందు కంటే.. దుమ్ము వల చనిపోయేది పాతిక రెట్లు ఎక్కువ” అంటూ జగపతి బాబు డైలాగ్‌తో ప్రారంభమైన సింబా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఎయిర్ పొల్యూషన్ గురించి చెబుతూ ఆలోచింపజేసేలా ఉంది.

ఇందులో స్కూల్ టీచర్‌గా అనసూయ భరద్వాజ్ నటిస్తున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. “వస్తువులు కొంతకాలమే ఉంటాయి. కానీ, మొక్కలు మనతోనే ఉంటాయి.. మనతో పాటు పెరుగుతాయి.. మన తరువాత కూడా ఉంటాయి” అని అనసూయ చెప్పిన డైలాగ్ బాగుంది. అనసూయ టీచర్‌గా హత్యలు చేసే యువతిగా కూడా కనిపించి ఆకట్టుకుంది.

సింబా సినిమాలో బ్యూటిఫుల్ బిగ్ బాస్ దివి వాద్యా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్‌గా, ప్రియురాలిగా నటించినట్లు తెలుస్తోంది. ఇక మూవీలో, ఫ్యాక్టరీలు, గాలి కాలుష్యం వల్ల ఎంతమంది నష్టపోయారనే విషయాన్ని క్రైమ్ అండ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, సింబా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న దివి, ఇతర నటీనటులు ఆసక్తికర విశేషాలు చెప్పారు.

“సింబా చిత్రంలో మంచి సందేశం ఉంది. మేం ప్రాణం పెట్టి సినిమాను చేశాం. నాకు ఇంత మంచి చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి” అని బిగ్ బాస్ దివి చెప్పుకొచ్చింది.

“సింబా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన వారందరికీ థాంక్స్. మొక్కలు నాటాలి, చెట్లు పెంచాలని చిన్నప్పటి నుంచీ చెబుతూనే ఉన్నారు. కానీ, ఆచరణలోకి తీసుకు రావడం లేదు. ఇలాంటి పాయింట్‌తో సినిమా రావడం ఆనందంగా ఉంది. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ చిత్రంలో నటించినందుకు గర్వంగా ఉంది. ఇందులో మంచి పాయింట్, కాన్సెప్ట్ ఉంది. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అని నటుడు వశిష్ట తెలిపారు.

కేతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. “మా వరలక్ష్మీ కాలేజ్‌లోనే షూటింగ్ జరిగింది. షూటింగ్ జరిగినన్ని రోజులు టీంతోనే ఉన్నాను. నేను కూడా ఈ చిత్రంలో కనిపిస్తాను. సమిష్టి కృషితో ఈ సినిమాను ఇంత బాగా తీశారు. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్” అని అన్నారు.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024