ఏదైనా ఉంటే.. నాతోనే తేల్చుకోండి !

Best Web Hosting Provider In India 2024

జాతీయ మీడియాతో వైయ‌స్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు  

న్యూఢిల్లీ:  ఏపీలో కూటమి ప్రభుత్వ అరాచక పాలనకు నిరసనగా ఢిల్లీలో ధర్నా చేసిన వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. జాతీయ మీడియా ఛానెల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలలో కీలక వ్యాఖ్యలు చేశారు. అమాయక జనాలపై దాడులు ఆపాలని, ఏదైనా ఉంటే తనతో తేల్చుకోవాలని  రాజకీయ ప్రత్యర్థులకు ఆయన పిలుపు ఇచ్చారు.  
ఎన్డీటీవీ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. ‘‘కావాలంటే నన్ను టార్గెట్‌ చేయండి. అమాయక ప్రజలు, కార్యకర్తల్ని ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు?. మీకు ఓట్లు వేయని ప్రజల్ని ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు?. ఇదసలు మానవత్వం అనిపించుకోదు. ఏదైనా ఉంటే.. తేల్చుకోవాలనుకుంటే.. నాతోనే తేల్చుకోండి. నన్ను చంపాలనుకుంటే చంపేయండి. నాపై ఉన్న కోపాన్ని అమాయకులపై ఎందుకు చూపిస్తారు?’’ అని వైయ‌స్‌ జగన్‌ సూటిగా నిలదీశారు. 

Best Web Hosting Provider In India 2024