
Best Web Hosting Provider In India 2024

Vizag Fraud: సోషల్ మీడియాలో అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టి… అబ్బాయిలతో పరిచయం పెంచుకుని…పెళ్లి చేసుకుంటానని మహిళ నమ్మించి… ఆ తరువాత వివిధ కారణాలు చెప్పి డబ్బులు గుంజుకుంటున్న మహిళ చేతుల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే యువకుడు మోసపోయాడు. ఆ యువకుడి వద్ద నుంచి రూ.22 లక్షలు లాగేసింది. ఆ కిలాడి లేడీని విశాఖపట్నం సైబర్ క్రైం పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.
విశాఖపట్నం నగరానికి చెందిన ఒక యువకుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉన్నారు. ఆ యువకుడు మ్యాట్రిమోనీలో పెళ్లి సంబంధాల కోసం రిక్వెస్టు పెట్టాడు. దీన్ని గమనించిన హైదరాబాద్‌లోని మాదాపూర్ తాండాకు చెందిన ఒక మహిళ బి.సాయిప్రియ (32) ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన యువకుడిని ఫాలో అయింది. అలా ఆ యువకుడితో పరిచయం పెంచుకుంది. తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ చేసేవారు. అలాగే పరిచయం బాగా పెరిగింది. దీంతో ఆ యువకుడి ఫోన్ నెంబర్ అడిగింది. పరిచయం బాగా పెరగడంతో ఆ మహిళ ఫోన్ నెంబర్ అడిగేసరికి ఆ యువకుడు ఇచ్చేశాడు.
వాట్సాప్‌లో అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టి అది తానే అన్నట్లు నమ్మించింది. ఆ యువకుడితో వాట్సాప్‌లో మంచిగా చాటింగ్ చేసేది. ఏవేవో చెప్పేది. వాటిని నమ్మి ఆమె వలలో యువకుడు పడ్డాడు. ఆ మహిళలను యువకుడు పూర్తిగా నమ్మాడు. ఆమె అడిగిన సమాచారం మొత్తం చెప్పేవాడు. అవి వ్యక్తిగత విషయాలు కావచ్చు, ఉద్యోగ విషయాలు కావచ్చు. అన్ని విషయాలు ఆ మాయ లేడితో పంచుకునేవాడు. అలా ఆ యువకుడి వ్యక్తిగత సమాచారం మొత్తం లాగేసింది.
ఇంకా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆమె వలలో కూరుకుపోయాడు. ఆమె ఏం చెబితే, అదే నమ్మేసేవాడు. పెళ్లి చేసుకుంటానని ఆ యువకుడిని నమ్మించింది. దీంతో ఆ యువకుడు పూర్తిగా ఆమెకు లొంగిపోయాడు. ఈ నేపథ్యంలో వివిధ కల్పిత అవసరాలను చెప్పి డబ్బులు అడిగేది. ఆమెను పూర్తిగా నమ్మిన ఆ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, ఆమె అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చేవాడు. ఆ రకంగా ఆయన వద్ద నుంచి ఏకంగా రూ.22 లక్షలు తన ఖాతాలో వేయించుకుంది. అలా ప్రతిసారి డబ్బులు అడిగేసరికి సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి అనుమానం వచ్చింది.
దీంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. ఆమెను హైదరాబాద్‌లోని మాదాపూర్ తాండాకు చెందిన బి.సాయి ప్రియగా గుర్తించారు. ఆమె ఇలా మోసం చేస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. బుధవారం ఆమెను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను విచారిస్తున్నట్లు సైబర్ క్రైమ్ సీఐ భవానీ ప్రసాద్ తెలిపారు. ఇలాంటి మోసాలకు పాల్పడితే విడిచిపెట్టేది లేదని పేర్కొన్నారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్